Rajya Sabha  Abhishek Singhvi:కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు అభిషేక్ మను సింఘ్వీ సీటు దగ్గర రూ. 500 నోట్ల కట్టలు దాదాపు వంద వరకు దొరికాయి. వీటి విలువ రూ. 50 వేలకు ఉంది. ఎంపీ అభిషేక్ మను సింఘ్వి దగ్గర దొరికిన డబ్బు ఎవరిదేనే కోనంలో విచారణ జరగుతోందని రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ కడ్ ఆదేశించారు. అభిషేక్ మను  సింఘ్వి సీటు దగ్గర ఈ  నోట్ల కట్టలు దొరకడం పెద్ద దుమారమే రేపుతోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

నోట్ల కట్టలు దొరకడంపై విచారణకు ఆదేశించారు రాజ్యసభ చైర్మన్ ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్ కడ్. నిన్న అభిషేక్ మను సింఘ్వి సీటు సమీపంలో ఈ నోట్ల కట్టలు దొరికినట్టు రాజ్యసభ చైర్మన్ తెలిపారు. ఇప్పటికే ఈ విషయమై విచారణ జరగుతున్నట్టు రాజ్యసభ సెక్రటరీ జరనల్ ప్రకటించారు. ఈ డబ్బులు రాజ్యసభకు ఎవరు తీసుకొచ్చారు. ఎందుకు తీసుకొచ్చారనే కోణంలో ఇన్వెష్టిగేషన్ మొదలు పెట్టారు. అయితే..డబ్బులు దొరకడంపై అభిషేక్ పై పలువరు సహచర ఎంపీలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ నోట్ల నావి కావు అని అభిషేక్ మను సింఘ్వి వాదనకు దిగారు.


అభిషేక్ మను సింఘ్వీ విషయానికొస్తే.. ఈయన తెలంగాణ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేతగా.. రాజ్యసభా పక్ష నేతగా వ్యవహరించిన కే.కేశవ రావు రాజీనామా చేయడంతో జరిగిన రాజ్య సభ ఉప ఎన్నికల్లో తెలంగాణ నుంచి పెద్దల సభకు వెళ్లారు. గతంలో 2009లో లోక్ సభ ఎన్నికల ముందు మన్మోహన్ సింగ్ అవిశ్వాస తీర్మాణంలో అపుడు కొంత మంది బీజేపీ ఎంపీలు నోట్ల కట్టలతో లోక్ సభలో ప్రవేశించడంపై అప్పట్లో పెద్ద దుమారమే రేగిన సంగతి తెలిసిందే కదా.


ఇదీ చదవండి: ముగ్గురు మొనగాళ్లు సినిమాలో చిరంజీవి డూప్ గా నటించింది వీళ్లా.. ఫ్యూజలు ఎగిరిపోవడం పక్కా..


ఇదీ చదవండి:  టాలీవుడ్ లో ఎక్కువ ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన చిత్రాలు.. ‘పుష్ప 2’ ప్లేస్ ఎక్కడంటే..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.