Rajyasabha Elections 2024: దేశంలో త్వరలో సార్వత్రిక ఎన్నికలతో పాటు కొన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు కూడా జరగనున్నాయి. అంతకంటే ముందే రాజ్యసభ ఎన్నికలు జరగబోతున్నాయి. ఏపీ, తెలంగాణ సహా మొత్తం 15 రాష్ట్రాల రాజ్యసభ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దేశంలో మొత్తం 15 రాష్ట్రాలకు సెంబంధించి 56 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఏపీలో 3, తెలంగాణలో మూడు, ఉత్తరప్రదేశ్‌లో 10, మహారాష్ట్రలో 6, బీహార్‌లో 6, పశ్చిమ బెంగాల్‌లో 5, మధ్యప్రదేశ్‌లో 5, గుజరాత్‌లో 4, కర్ణాటకలో 4, రాజస్థాన్‌లో 3, ఒడిశాలో 3, ఉత్తరాఖండ్‌‌లో 1, ఛత్తీస్‌గఢ్‌లో 1, హర్యానాలో 1, హిమాచల్ ప్రదేశ్‌లో 1 స్థానానికి సంబంధించిన ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. ఈ ఎన్నికలు ఫిబ్రవరి 27న జరగనున్నాయి. అంటే దేశంలో సార్వత్రిక ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికల కంటే ముందే రాజ్యసభ ఎన్నికల గండం పొంచి ఉంది వివిధ పార్టీలకు. మొత్తం 56 స్థానాల్లో  50 మంది పదవీకాలం ఏప్రిల్ 2తో ముగుస్తుంటే..మిగిలిన ఆరుగురి పదవీకాలం ఏప్రిల్ 3తో ముగియనుంది. 


రాజ్యసభ ఎన్నికలకు ( Rajyasabha Elections schedule released) నోటిఫికేషన్ ఫిబ్రవరి 8న వెలువడనుంది. నామినేషన్లకు చివరి తేదీ ఫిబ్రవరి 15 కాగా నామినేషన్ల పరిశీలన ఫిబ్రవరి 16న ఉంటుంది. నామినేషన్ల ఉపసంహరణకు ఫిబ్రవరి 20 గడువు తేదీ. ఎన్నికల తేదీ ఫిబ్రవరి 27. రాజ్యసభ ఎన్నికల కౌంటింగ్  అదే రోజు సాయంత్రం ప్రారంభమౌతుంది. ప్రస్తుతం రాజ్యసభలో మొత్తం 238 సభ్యులుంటే బీజేపీకు అత్యధికంగా 93, కాంగ్రెస్ 30, టీఎంసీ 13, ఆప్ 10, డీఎంకే 10 స్థానాలున్నాయి. 


Also read: CAA in India: సీఏఏపై మళ్లీ వివాదం, వారం రోజుల్లో అమలు చేస్తామని కేంద్ర మంత్రి వ్యాఖ్యలు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook