Vijayasai Reddy: చిరు వ్యాఖ్యలపై రేగుతున్న దుమారం, మీరేమైనా ఆకాశం నుంచి ఊడిపడ్డారా
Vijayasai Reddy: మెగాస్టార్ చిరంజీవి వ్యాఖ్యల దుమారం రోజురోజుకూ పెరుగుతోంది. చిరు వ్యాఖ్యలకు దీటుగా ఓ వైపు మంత్రులు కౌంటర్ ఇస్తుంటే మరోవైపు సోషల్ మీడియాలో ట్రోలింగ్ పెరుగుతోంది. ఇప్పుడు కొత్తగా రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కౌంటర్ ఇచ్చారు.
Vijayasai Reddy: వాల్తేరు వీరయ్య 200 రోజుల వేడుకలో చిరంజీవి ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. పవన్ కళ్యాణ్ కోసమే చిరంజీవి ఇలాంటి వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఓ వైపు మంత్రులు ఇప్పటికే కౌంటర్ ఇవ్వగా..తాజాగా విజయసాయిరెడ్డి గట్టిగానే సమాధానమిచ్చారు. పూర్తి వివరాలు మీ కోసం,
వాల్తేరు వీరయ్య వేడుకలో సినిమా వాళ్ల పారితోషికాల గురించి పెద్దల సభల్లో మాట్లాడుతున్నారని..వాళ్లకేం పనీ పాటా లేదా అని అన్పిస్తోందని చిరు వ్యాఖ్యానించారు. తాము ఎన్ని సినిమాలు చేస్తే అంతమందికి కడుపు నిండుతుందన్నారు. వ్యాపారం జరుగుతుంది కాబట్టి సినిమాలు చేస్తున్నామన్నారు. తాను రాజకీయాలు, సినిమా రెండూ చూశానని..రాజకీయ నేతలు పెద్ద పెద్ద విషయాల్లో జోక్యం చేసుకోవాలి గానీ..సినీ తారల పారితోషికాల గురించి మాట్లాడటం తప్పన్నారు. ప్రభుత్వం తమపై ఫోకస్ పెట్టకుండా అభివృద్ధి, పోలవరం వంటి అంశాలపై ధ్యాస పెట్టాలని సూచించారు. ఈ వ్యాఖ్యలే రాజకీయంగా దుమారం రేపుతున్నాయి. సినిమాను అణగదొక్కేందుకు ప్రభుత్వం ప్రయత్నించకూడదని, వీలైతే సహకరించాలని కోరారు.
తాజాగా రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డి దీటైన సమాధానమిచ్చారు. ఎందుకంటే చిరు చేసిన ఈ వ్యాఖ్యలు విజయసాయియరెడ్డిని దృష్టిలో ఉంచుకుని చేసినవే. రాజ్యసభలో సినిమాటోగ్రఫీ సవరణ బిల్లుపై జరిగిన చర్చలో హీరోల పారితోషికంపై చర్చ జరిగింది. ఈ చర్చలో విజయసాయిరెడ్డి మాట్లాడారు. సినిమా అంటే హీరో ఒక్కడే కాదని..హీరోలకు సింహభాగం వెళ్లే విధానం మారాలని సూచించారు. ఈ వ్యాఖ్యలపైనే చిరంజీవి కామెంట్ చేసినట్టు తెలుస్తోంది.
చిరు చేసిన వ్యాఖ్యలకు విజయసాయిరెడ్డి దీటైన కౌంటర్ ఇస్తూ ట్వీట్ చేశారు. సినిమా రంగమేమీ ఆకాశం నుంచి ఊడిపడలేదని తెలిపారు. సినీ తారలైనా, రాజకీయ నేతలైనా ప్రజలు ఆదరించినంతవరకూ ఆదరణ ఉంటుందని గుర్తుంచుకోవాలన్నారు. సినీ పరిశ్రమలో ఉండే వ్యక్తుల యోగ క్షేమాలు చూసే బాధ్యత ప్రభుత్వానికుందని..వారి గురించి మీకెందుకు , వీరి గురించి ప్రభుత్వానికెందుకు అంటే కుదరదన్నారు.
Also read: నటుడు ప్రకాష్ రాజ్ సందర్శించిన కాలేజీని గోమూత్రంతో శుద్ధి చేసిన విద్యార్థులు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook