Ayodhya Ram mandir Inauguration: అయోధ్య రామమందిరం (Ram Mandir) ప్రారంభోత్సవానికి శరవేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆలయ ప్రారంభోత్సవం, ప్రాణప్రతిష్ట కార్యక్రమం 2024 జనవరి 22న మధ్యాహ్నం 12:20 గంటలకు జరగనుంది. ఈ వేడుకకు ప్రధాని మోదీ సహా దేశంలోని వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు హాజరుకానున్నారు. రామ్‌లల్లా విగ్రహ ప్రతిష్ఠాపన నేపథ్యంలో ప్రధాని మోదీ 11 రోజుల ఉపవాస దీక్ష చేపట్టనున్నారు. పండితుల సూచన మేరకు ఆయన ఈ నిర్ణయం తీసకున్నారు. అంతేకాకుండా ఈ వేడుకలో శ్రీరాముడు విల్లును ధరించబోతున్నాడు. 2.5 కిలోల బరువు గల విల్లును అయోధ్యకు చెందిన అమవా రామాలయ నిర్వాహకులు శ్రీరామ్‌జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌కు అందజేయనున్నారు. ఈ విల్లు కోసం 600-700 గ్రాముల బంగారాన్ని వాడారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రామమందిర ప్రారంభోత్సవ నేపథ్యంలో... అయోధ్యలో హోటళ్లకు రెక్కలు వచ్చాయి. అక్కడ హోటళ్ల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. రూమ్ రేట్లు ఏకంగా 500 శాతం పెరిగాయి. ఇప్పటికే చాలా గదులు బుక్ అయినట్లు అధికారులు చెబుతున్నారు. ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి సుమారు 5 లక్షల మంది వరకు నగరానికి వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో రేట్లను విపరీతంగా పెంచేశారు హోటళ్ల యాజమానులు. అయోధ్యలోని హోటల్‌ ‘ఇన్‌ రాడిషన్‌’లో గది అద్దె రూ.లక్ష వరకు చేరినట్టు ఓ వార్తా సంస్థ వెల్లడించింది. రామ్‌లల్లా ప్రాణప్రతిష్ఠ నేపథ్యంలో చుట్టుపక్కల ఉన్న జిల్లాల వాసులు అయోధ్యకు రావటాన్ని అధికారులు మూడు రోజుల పాటు నిషేధం విధించారు. అంతేకాకుండా అయోధ్యలో  28 భాషల్లో సైన్‌ బోర్డులను ఏర్పాటు చేశారు. ఇందులో తెలుగు సైన్ బోర్డు కూడా ఉంది. 


Also Read: Ayodhya Ram Mandir: అయోధ్య రామమందిరానికి ఎలా చేరుకోవాలి..? హరతి టికెట్ ఎలా బుక్ చేసుకోవాలి..? వివరాలు ఇవిగో..


Also Read: Atal Setu Bridge: ముంబైలో 'అటల్ సేతు' వంతెనను ప్రారంభించిన ప్రధాని మోదీ.. హైలైట్స్ ఇవే..!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter