Atal Setu inauguration LIVE Updates: దేశంలోనే అత్యంత పొడవైన సముద్రపు వంతెనను ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం ప్రారంభించారు. ముంబై నగరంలో నిర్మించిన 21.8 కిలోమీటర్ల పొడవైన ఈ బ్రిడ్జికు మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి జ్ఞాపకార్థం 'అటల్ సేతు' అని పేరు పెట్టారు. ముంబైలోని సేవ్రీ నుంచి రాయగఢ్ జిల్లాలోని చిర్లేను కలుపుతూ ఆరు లేన్లుగా దీన్ని నిర్మించారు. దీనిని రూ. 17 వేల 840 కోట్ల వ్యయంతో కట్టారు. ఇది సముద్రంపై సుమారు 16.5 కి.మీ మరియు భూమిపై 5.5 కి.మీ ఉంటుంది.
ఈ వంతెన కారణంగా ముంబై, నవీ ముంబైల మధ్య ప్రయాణ దూరం రెండు గంటల నుంచి 15-20 నిమిషాలకు తగ్గుతుంది. ముంబై నుండి పూణే, గోవా మరియు దక్షిణ భారతదేశానికి ప్రయాణ సమయాన్ని కూడా తగ్గిస్తుంది. 2016 డిసెంబర్‌లో ఈ బ్రిడ్జికి ప్రధానమంత్రి శంకుస్థాపన చేశారు. ఈ వంతెన నిర్మాణంలో ఈఫిల్ టవర్ లో వాడిన దాని కన్నా 17 రెట్లు ఎక్కువ ఇనుమును వినియోగించార. స్టాట్యూ ఆఫ్ లిబర్టీ విగ్రహానికి ఉపయోగించిన కాంక్రీట్ కంటే ఆరు రెట్లు అధికంగా వాడారు. దీని కారణంగా ముంబై పోర్ట్ మరియు జవహర్‌లాల్ నెహ్రూ పోర్ట్ మధ్య కనెక్టివిటీ మెరుగుపడుతుంది.
అటల్ వంతెనపై పటిష్ట భద్రతను ఏర్పరిచారు. ఇందులో భాగంగా 400 సీసీటీవీ కెమెరాలను అమర్చారు. అంతేకాకుండా ఫ్లెమింగో పక్షుల రాకను దృష్టిలో ఉంచుకుని వంతెనపై సౌండ్ బారియర్ ను కూడా ఏర్పాటు చేశారు. అటల్ సేతు ప్రారంభోత్సవం తర్వాత నవీ ముంబైలో రూ. 12,700 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు ప్రధాని మోదీ.
Also Read: Ayodhya Ram Mandir Video: అయోధ్య రామమందిరం వాట్సాప్ స్టేటస్ వీడియో..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook