Ramdev Baba was fine says spokes person: న్యూఢిల్లీ: యోగాలో సిద్ధహస్తుడిగా పేరున్న బాబా రాందేవ్ (Ramdev) తాజాగా ఓ ఏనుగు ఎక్కి యోగా చేస్తున్న క్రమంలో బ్యాలెన్స్ తప్పి కిందపడిపోయిన సంగతి తెలిసిందే. ఈ వీడయో గత రెండురోజుల నుంచి అన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలల్లో తెగ వైరల్ (Viral Video) అయిపోయింది. అయితే సోమవారం ఏనుగుపై యోగా చేస్తూ.. (Baba Ramdev falls off elephant) కింద పడిన యోగా గురు రాందేవ్ బాబా సురక్షితంగా ఉన్నారని.. ఎవరూ చింతించకండి అంటూ.. ఆయన అధికార ప్రతినిధి ఎస్‌‌‌‌‌‌‌‌కే టిజరావాలా గురువారం ట్విట్ చేశారు. యోగా గురు రాందేవ్ బాబాకు ఎలాంటి గాయాలు కాలేదని ఆయన స్పష్టంచేశారు. 



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ మేరకు ఆయన ఈ విధంగా ట్విట్ చేశారు. స్వామీజీ సురక్షితంగా ఉన్నారని.. ఆయన కోట్లాది మంది అనుచరులకు తెలియజేయాలనుకుంటున్నాను. ఏనుగుపై నుంచి స్వామిజీ కిందపడిన సంఘటన వినోదభరితమైనది. చింతించకండి. బాబా నిన్న, ఈ రోజు (మంగళవారం, బుధవారం) నాలుగు నాలుగు గంటలపాటు లైవ్ యోగా చేశారు అంటూ.. రామ్‌దేవ్ ప్రతినిధి టిజరావాలా ట్వీట్ చేశారు. Also read: Watch Baba Ramdev falls off elephant: ఏనుగుపై యోగా చేస్తూ కింద పడిన బాబా రాందేవ్‌


ఉత్తర్ ప్రదేశ్ మధురకు సమీపంలోని మహావన్‌‌లో ఉన్న రామ్ నరేతి ఆశ్రమంలో సోమవారం.. బాబా రాందేవ్ ఏనుగుపై ప్రాణాయమ యోగా ( Pranayama yoga ) చేస్తుండగా ఈ ఘటన జరిగింది. అదృష్టవశాత్తుగా ఈ ఘటనలో బాబా రాందేవ్‌కి ఎటువంటి గాయాలు కాలేదు ( Baba Ramdev not injured). కింద పడినప్పటికీ వెంటనే లేచి నవ్వుకుంటూ ముందుకు సాగిపోయారు బాబా రాందేవ్. 


Also read : Viral video: కోతికి గిఫ్ట్ ఇస్తే.. కోతి ఫేస్‌లో ఆ ఎక్స్‌ప్రెషన్ చూసి తీరాల్సిందే


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe