Rameshwaram Cafe Blast: కర్ణాటక రాజధాని బెంగళూరులోని రామేశ్వరం కేఫ్‌లో చోటుచేసుకున్న బాంబు ఘటనలో కీలక పరిణామం చోటుచేసుకుంది. బాంబు పెట్టినవాళ్లుగా అనుమానిస్తున్న ఇద్దరు కీలక నిందితులును కేంద్ర దర్యాప్తు సంస్థ అరెస్ట్‌ చేసింది. దీంతో ఈ కేసు ఒక కొలిక్కి వచ్చినట్టు తెలుస్తోంది. కాగా ఈ పేలుళ్ల వెనుక అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ 'ఐఎస్‌ఐఎస్‌' ఉందని తేలింది. బెంగళూరులో తమ కార్యకలాపాలు కొనసాగించేందుకు ఈ పేలుడుకు పాల్పడినట్లు తేలింది. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: NIA Reward: బాంబ్‌ పెట్టినోడిని పట్టిస్తే అక్షరాల రూ.10 లక్షల నగదు ...


 


కర్ణాటక రాజధాని బెంగళూరులోని వైట్‌ఫీల్డ్‌ ప్రాంతంలో ఉన్న రామేశ్వరం కేఫ్‌లో మార్చ్‌ 1వ తేదీన బాంబు పేలుడు జరిగిన విషయం తెలిసిందే. మాస్కు ధరించి వచ్చిన ఓ యువకుడు తన బ్యాగ్‌ను కేఫ్‌లో వదిలివెళ్లాడు. కాసేపటికి పేలుడు సంభవించి 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఘటన జరిగిన నాటి నుంచి స్థానిక పోలీస్‌ యంత్రాంగంతో పాటు కేంద్ర దర్యాప్తు సంస్థ రంగంలోకి దిగింది. పేలుళ్ల కేసును కర్ణాటక ప్రభుత్వం జాతీయ విచారణ సంస్థ (ఎన్‌ఐఏ)కు అప్పగించింది. బాంబు పెట్టిన వ్యక్తి కనుక్కోవడానికి దర్యాప్తు సంస్థలు తీవ్రంగా శ్రమించాయి. ఈ నేపథ్యంలో సీసీ కెమెరాల్లో అతడు కనిపించిన దృశ్యాలను పోలీసులు విడుదల చేసి ప్రజల నుంచి సహాయం కోరారు. అతడి ఆచూకి చెబితే రూ.10 లక్షల నగదు బహుమతి ఇస్తామని ప్రకటించారు.

Also Read: Rameshwaram Cafe Blast: రామేశ్వరం కేఫ్ పేలుడు ఘటన.. కీలక నిందితుడి అరెస్టు..


 


ఆధారాలు, ఊహాచిత్రాలు వంటి వాటితో దర్యాప్తు ప్రారంభించిన జాతీయ దర్యాప్తు సంస్థ ఎట్టకేలకు అనుమానితులను పట్టుకుంది. ఇద్దరిని అరెస్ట్‌ చేయగా వారిద్దరూ కూడా ఉగ్రవాదులేనని తెలిసింది. రామేశ్వరం కేఫ్‌లో బాంబు పేలుడు ఘటనకు ముస్సావిర్‌ హుస్సేన్‌ షాజిబ్‌, అబ్దుల్‌ మతీన్‌ తహలను నిందితులుగా గుర్తించారు. తాజాగా వారిద్దరిని పోలీసులు శుక్రవారం అరెస్ట్‌ చేశారు. బాంబు పేలుడు అనంతరం షాజిబ్‌ కర్ణాటకను వదిలి అస్సాం, పశ్చిమ బెంగాల్‌లో తప్పించుకు తిరిగాడు. కాగా మతీన్‌ తాహ బాంబు పేలుడుకు పథకం రచించగా.. షాజిబ్‌ బాంబును హోటల్‌లో పెట్టి ఉంచాడు. ఇక ఇప్పటికే ఈ కేసులో గతంలోనే ఇద్దరిని అరెస్ట్‌ చేశారు. వారిద్దరూ షాజిబ్‌, తాహలకు సహకరించినవారు.


కాగా నిందితులు ఇద్దరు కూడా కర్ణాటకలోని శివమొగ్గ జిల్లాకు చెందినవారు కావడం విశేషం. నిందితుల కోసం తెలంగాణ సహా ఉత్తరప్రదేశ్‌, కేరళ, పశ్చిమ బెంగాల్‌ తదితర రాష్ట్రాల్లో గాలించారు. గాలింపు చర్యల్లో భాగంగా షాజిబ్‌, తాహ పశ్చిమ బెంగాల్‌లోని కంతీ ప్రాంతంలో ఆచూకీ లభించింది. 18 ప్రాంతాల్లో గాలించిన అనంతరం స్థానికుల సహాయంతో వారిద్దరినీ అదుపులోకి తీసుకున్నారు.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook