సోషల్ మీడియా మాద్యమంగా ( Social media ) మనం తరచూ విభిన్నమైన వీడియోలు, ఫోటోలు చూస్తుంటాం. ఇటువంటివి సహజంగానే వైరల్ అవుతుంటాయి. తాజాగా అత్యంత అరుదైన ఓ జంతువు వీడియోను ఇలాగే ఓ ఫారెస్ట్ అధికారి ( Forest Officer ) షేర్ చేశారు. షేర్ చేయడమే ఆలస్యం..వైరల్ అయిపోయింది. ఇండియన్ ఫారెస్ట్ ఆఫీసర్ సుధా రామెన్ షేర్ చేసిన ఆ వీడియో ఏంటో ఇప్పుడు చూద్దాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


ఇది బ్లాక్ పాంథర్ లా కన్పిస్తుండవచ్చు కానీ కాదు. అంతరించిపోతున్న అరుదైన జంతువుల్లో ఒకటి ఇది. దీన్ని నీలగిరి పిల్లి ( Nilgiri cat ) అంటారు. దక్షిణ భారతంలోని పశ్చిమ కనుమల్లో ( Western ghats ) నివసించే ఈ జంతువు చాలా అరుదుగానే కన్పిస్తుంటుంది. మార్టెన్ ( Marten ) జాతికి చెందిన ఈ జంతువు ప్రస్తుతం అంతరించే దశలో ఉండటం గమనార్హం. ఇది ఈ ఫారెస్ట్ ఆఫీసర్ సుధా రామెన్ ( Forest officer sudha ramen ) కంటికి కన్పించడంతో వీడియో తీసి షేర్ చేశారు.



ఈ నీలగిరి పిల్లి మెడభాగం పసుపు, నలుపు రంగులో మిళితమై ఉంటుంది. 2.1 కిలోల బరువు, 40-45 సెంటీమీటర్ల పొడవు తోకను కలిగి ఉంటుంది. జీవజాతుల ప్రపంచ పరిరక్షణ స్థితిని అధ్యయనం చేసే ఐయూసిఎస్ ( ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ ) ఈ జంతువును రెడ్ లిస్ట్ లో అంటే ప్రమాదకర స్థితిలో చేర్చింది. Also read: Sex Racket Busted: సెక్స్ రాకెట్ చెర నుంచి ఇద్దరు మహిళలకు విముక్తి