Ration Card Surrender: రేషన్ కార్డు లబ్దిదారులకు గుడ్‌న్యూస్, కార్డుల సరెండర్ అవాస్తవం
Ration Card Surrender: రేషన్ కార్డు సరెండర్ లేదా రద్దు చేసే విషయమై గత కొద్దికాలంగా వస్తున్న వార్తలపై స్పష్టత వచ్చింది. ఈ విషయంపై ప్రభుత్వం శుభవార్త అందించింది. ఆ వివరాలు మీ కోసం..
Ration Card Surrender: రేషన్ కార్డు సరెండర్ లేదా రద్దు చేసే విషయమై గత కొద్దికాలంగా వస్తున్న వార్తలపై స్పష్టత వచ్చింది. ఈ విషయంపై ప్రభుత్వం శుభవార్త అందించింది. ఆ వివరాలు మీ కోసం..
గత కొద్దికాలంగా రేషన్ కార్డు వెనక్కి ఇవ్వాలని, రేషన్ బియ్యం లేదా డబ్బులు వసూలు చేస్తారనే వార్తలు కార్డు లబ్దిదారుల్ని ఇబ్బంది పెడుతున్నాయి. మీకు కూడా అలాంటి మెస్సేజ్ వచ్చిందా.. రేషన్ కార్డు విషయమై వస్తున్న వార్తలతో ఆందోళన చెందుతుంటే..ఇక రిలాక్స్ అవండి. వాస్తవానికి కొద్ది రోజుల క్రితం యూపీలోని యోగీ ప్రభుత్వం బోగస్ రేషన్ కార్డుల ఏరివేతలో భాగంగా రేషన్ కార్డులు సరెండర్ చేయాలని..అవసరమైతే వసూళ్లు కూడా ఉంటాయని ఆదేశించినట్టు వార్తలు ప్రచారమయ్యాయి. కొన్ని ప్రాంతాల్లో అయితే రేషన్ కార్డులు సరెండర్ చేసేందుకు క్యూలో కూడా జనం నిలుచున్న పరిస్థితి. ఇప్పుడీ విషయంపై స్పష్టత వచ్చింది.
అయితే ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఈ పుకార్లపై క్లారిటీ ఇచ్చింది. ప్రభుత్వం నుంచి అలాంటి ఆదేశాలేవీ జారీ కాలేదని వివరించింది. ఇలాంటి తప్పుడు ఆదేశాలు ఎవరిచ్చారనేది తెలుుకుని..వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించినట్టు రెవిన్యూ అధికారులు తెలిపారు. ప్రభుత్వం ఇచ్చిన క్లారిటీతో లబ్దిదారుల్లో కాస్త ఊరట కన్పించింది. రేషన్ కార్డు వెరిఫికేషన్ అనేది ఓ సాధారణ ప్రక్రియ అని...ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు ఈ ప్రక్రియ అమలు చేస్తుంటాయని రెవిన్యూ శాఖ వెల్లడించింది. రేషన్ కార్డుల సరెండర్ విషయంలో వస్తున్న వార్తల్ని నమ్మవద్దని కోరారు.
వాస్తవానికి రేషన్ కార్డు సవరణ 2014 తరువాత మళ్లీ జరగలేదు. 2011లో జనాభా లెక్కల ఆధారంగా రేషన్ కార్డులు జారీ అయ్యాయి. రేషన్ కార్డు లబ్దిదారుడికి పక్కా ఇళ్లు, విద్యుత్ కనెక్షన్, లైసెన్స్డ్ వెపన్, ద్విచక్ర వాహనం ఉన్నా లేదా పశువులు పెంచుతున్నారనే కారణంతో రేషన్ కార్డుకు అనర్హుడిగా పరిగణించరు. రేషన్ కార్డు సరెండర్ ఒక్కటే కాకుండా రేషన్ బియ్యం లేదా డబ్బులు వసూలు చేస్తామనే వార్తల్ని కూడా ప్రభుత్వం ఖండించింది. అలాంటి ఆదేశాలేవీ ఇవ్వలేదని ప్రభుత్వం స్పష్టం చేసింది.
Also read: Monkeypox Symptoms: భారత్‌లో పెరుగుతున్న మంకీపాక్స్ కేసులు.. ఈ లక్షణాలు ఉంటే వెంటనే జాగ్రత్త పడండి!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.