Reserve Bank Of India: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకు వినియోగదారులకు ( Bank Account Holders ) సరికొత్త సూచనలు జారీ చేసింది. సైబర్ స్కామ్‌ల ( Cyber Scams ) నుంచి జాగ్రత్తగా ఉండాలి అని హెచ్చరించింది. ప్రపంచంలో మునుపెన్నడూ లేని విధంగా సైబర్ నేరాలు ( Cyber Crimes ) పెరుగుతున్నాయి అని.. మోసపోకుండా జాగ్రత్తగా ఉండాలని తెలిపింది. ముఖ్యంగా సైబర్ క్రైమ్, ఐడెంటిటీ థెఫ్ట్ ( Identity Theft ) వంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి అని తెలిపింది. ( Credit Card Benefits: క్రెడిట్ కార్డు వల్ల లాభాలివే.. )


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING



బ్యాంకు వినియోగదారులు తమ డబ్బును సురక్షితంగా ఉంచుకునేలా జాగ్రత్తలు తీసుకోవాలి అని ట్వీట్ చేసింది ఆర్‌బీఐ ( RBI) . ఇటీవలే బిల్ గేట్స్ ( Bill Gates ) , బరాక్ ఒబామా ( Barack Obama ) వంటి ప్రముఖుల ట్విట్టర్ ఎకౌంట్స్ హ్యాక్ అవడంతో ఈ సూచనలు చేసినట్టు తెలుస్తోంది. ఓటీపి ( One Time Password ) ను ఎవరితో షేర్ చేసుకోవద్దు అని ఆర్‌బీఐ కోరింది. ఇలా చేస్తే బ్యాంకు వినియోగదారులకు తెలియకుండానే హ్యాకర్లు వారి ఖాతా నుంచి డబ్బను దొంగలించే అవకాశం ఉందని హెచ్చరించింది. దాంతో పాటు పబ్లిక్ ప్లేస్‌లో చార్జింగ్ పెట్టుకోవద్దు అని.. అలాగే పబ్లిక్ వైఫై వినియోగించే సమయంలో బ్యాంకు వివరాలు ఎంటర్ చేసే విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి అని తెలిపింది.  Disha Patani: దిశా పటానీ లేటెస్ట్ ఫొటోస్



Follow us on twitter