Types Of Post Office Account | బంగారు భవిష్యత్తు కోసం మనం కొత్త కొత్ మార్గాలను వెతుకుతూ ఉంటాము. దేశంలో మ్యూచువల్ ఫండ్, షేర్ మార్కెట్‌లో పెట్టుబడి పెడతాము. అయితే మరింత సురక్షిత పెట్టుబడి మార్గాల్లో డబ్బు పెట్టడానికి ప్రయత్నిస్తాము. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


Also Read | EPFO ఖాతా ఉందా? అయితే ఈ 5 ప్రయోజనాల గురించి తెలుసుకోండి!


సురక్షితమైన రిటర్న్ ఇవ్వగల సాధనాల్లో పోస్ట్ ఆఫిస్ స్కీమ్ కూడా ఉంది. నిజానికి మంచి రిటర్న్స్ కోసం చాలా మంది తమకు తెలియని అంశాలపై పెట్టుబడి పెడుతుంటారు. అయితే మనకు మంచి ఆదాయంతో పాటు తక్కువ రిస్కు ఉన్న మార్గాల్లో పెట్టుబడి పెట్టాలి అంటే అందులో పోస్ట్ ఆఫిస్ (Post Office) మంచి అప్షన్ అవుతుంది. ఇందులో ఉన్న స్కీమ్స్‌తో మీ భవిష్యత్తు సురక్షితం అవడమే కాదు.. మంచి ఆదాయం కూడా లభిస్తుంది.


పోస్ట్ ఆఫిస్ చిన్న మొత్తాల పథకం చాలా ఉపయోగకరం. ఇందులో పెట్టుబడి పెడితే ప్రభుత్వ గ్యారంటీ మాత్రమే దొరుకుతుంది. దాంతో పాటు మంచి రిటర్న్ కూడా  లభిస్తుంది. పన్ను (Tax) రాయితీ కూడా లభిస్తుంది. 


ఒక వేళ మీరు ఎక్కవ రిస్కు ఉన్న స్కీమ్‌లో పెట్టుబడి పెట్టకూడదు అనుకుంటే మీకు మంత్లీ ఇంకమ్ స్కీమ్ మంచి ఆప్షన్ అవుతుంది. ఇందులో మీకు 6.60 శాతం వడ్డీ లభిస్తుంది. 



Also Read | PM Awas Yojana: అప్లై చేసే సమయంలో ఈ తప్పులు చేస్తే సబ్సిడీ అస్సలు రాదు, వెంటనే చదవండి


కేవలం రూ.20 రూపాయలు డిపాజిట్‌తో ఎవరైనా పోస్ట్ ఆఫిస్ సేవింగ్ ఎకౌంట్ తెరవవచ్చు. దాంతో పాటు రికరింగ్ డిపాజిట్ ఎకౌంట్‌లో 5.8 శాతం వడ్డీ లభిస్తుంది. రికరింగ్ డిపాజిట్ స్కీమ్‌లో ప్రతీ నెల తప్పకుండా డిపాజిట్ చేయాల్సిన అతి తక్కువ నగదు రూ.10 మాత్రమే. రానున్న ఐదు సంవత్సరాల్లో వడ్డీ పెరిగే అవకాశం కూడా ఉంటుంది.


నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ అనేది ఫిక్సెడ్ డిపాజిట్ లాంటిది. PPFలాగే దీని వడ్డీపై ట్యాక్స్ రాయితీ ఉంటుంది. మీకు 8 శాతం వడ్డీ లభిస్తుంది. ఈ వడ్డీ రేటు మారే అవకాశం కూడా ఉంటుంది. అయితే వడ్డీ డబ్బులు మీకు పథకం మెచ్యురిటీ పూర్తి అయ్యాకే లభిస్తుంది.  


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


  • మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook