భోపాల్: కరోనా వైరస్ మహమ్మారిని అరికట్టేందుకు ఏం చేయాలో తెలియక వైద్యశాస్త్ర నిపుణులు తికమక పడుతుంటే బీజేపీ ఎంపీ ప్రగ్యా సింగ్ ఠాకూర్ (BJP MP Pragya Thakur) భారతీయులకు ఓ సలహా ఇచ్చారు. కరోనాను జయించేందుకు జులై 25 నుంచి ఆగస్టు 5వ తేదీ వరకు ప్రతిరోజూ 5సార్లు హనుమాన్ చాలీసా (Hanuman Chalisa) పఠించాలని భోపాల్ ఎంపీ ప్రగ్యా ఠాకూర్ పిలుపునిచ్చారు. ఈ మేరకు బీజేపీ మహిళా నేత చేసిన ట్వీట్ వివాదాస్పదంగా మారింది. Telangana: త్వరలో 2 లక్షల యాంటీజెన్ కిట్లతో పరీక్షలు


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆగస్టు 5న అయోధ్యలో రామాలయం నిర్మాణానికి భూమి పూజకు శుభ ముహూర్తం నిర్ణయించారు. ఈ నేపథ్యంలో కొన్ని రోజులపాటు ప్రతిరోజూ భక్తిశ్రద్ధలతో హనుమాన్ చాలీసా పఠిస్తే కరోనా మహమ్మారి నుంచి గట్టెక్కుతామని తన వీడియో ట్వీట్‌లో ఎంపీ ప్రగ్యా ఠాకూర్ పేర్కొన్నారు. బికినీలో టైటిల్ నెగ్గిన నటి హాట్ హాట్‌గా..


జులై 25 నుంచి ఆగస్టు 5 వరకు ప్రతిరోజూ రాత్రి 7 గంటలకు 5సార్లు హనుమాన్ చాలీసా చదవాలని బీజేపీ ఎంపీ చేసిన ట్వీట్ హాట్ టాపిక్ అవుతోంది. రామ మందిరం నిర్మాణానికి భూమి పూజ నిర్వహించే ఆగస్టు 5వ తేదీన ప్రజలందరూ తమ ఇళ్లల్లో రాముడి చిత్రపటం ముందు దీపాలు వెలిగించి హారతి ఇవ్వాలని పిలుపునిచ్చారు. 
వర్మ సెక్సీ హీరోయిన్ Apsara Rani Hot Stills వైరల్