Telangana Temperature: తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి.. గరిష్ఠ ఉష్ణోగ్రతలు ఇవే!
High temperatures recorded in Telangana and AP States. భానుడి ప్రతాపంతో తెలుగు రాష్ట్రాల ప్రజలు అల్లాడుతున్నారు. మధ్యాహ్నం అయితే బయటికి రావడానికి జంకుతున్నారు.
Record temperatures in Telangana and AP States: తెలుగు రాష్ట్రాలు ఏపీ, తెలంగాణలో ప్రస్తుతం ఎండలు దంచి కొడుతున్నాయి. రోజురోజుకీ ఎండల తీవ్రత ఎక్కువ అవుతోంది. అదే సమయంలో వడగాలుల తీవ్రత కూడా అధికమైంది. భానుడి ప్రతాపంతో తెలుగు రాష్ట్రాల ప్రజలు అల్లాడుతున్నారు. మధ్యాహ్నం అయితే బయటికి రావడానికి జంకుతున్నారు. ఏపీలోని కోస్తా, రాయలసీమ ప్రాంతాలు నిప్పుల కొలిమిలా మారాయి. సాధారణం కంటే 4-6 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్లు అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. మిగతా ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రతల తీవ్రత 40 డిగ్రీలకు పైనే ఉంటుందని పేర్కొంది.
వాయవ్య భారత్ నుంచి వీస్తున్న వేడి గాలుల కారణంగా ఏపీలో ఉష్ణోగ్రతల తీవ్రత భారీగా పెరిగినట్లు భారత వాతావరణ విభాగం తెలిపింది. ప్రస్తుతం గరిష్ఠ ఉష్ణోగ్రతలు దాదాపుగా 45 డిగ్రీలకు చేరింది. బాపట్లలో గరిష్ఠంగా 44.8 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. జగ్గయ్యపేటలో 44.7 డిగ్రీలు, పోలవరంలో 44.6 డిగ్రీలు, ప్రకాశంలో 44.5, ఏలూరులో 44.56, గుంటూరులో 44.4, కాకినాడ 44.28 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది.
కోనసీమలో 44.2, అల్లూరిలో 43.7, పలనాడులో 44.21, నెల్లూరులో 44.09, కృష్ణాలో 44, పశ్చిమ గోదావరిలో 43.8, తిరుపతిలో 44.08, శ్రీకాకుళంలో 43.82, తూర్పు గోదావరిలో 43.7, కడప 42.8, విజయనగరంలో 42.6 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైనట్లు భారత వాతావరణ విభాగం పేర్కొంది. వచ్చే 2-3 రోజుల్లో కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో ఉష్ణోగ్రతల తీవ్రత 46 డిగ్రీల వరకూ చేరే అవకాశం ఉన్నట్లు అధికారులు చెప్పారు.
తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 42 నుంచి 44 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. మంగళవారం నుంచి హైదరాబాద్ చుట్టు పక్కల జిల్లాల్లో పగటి ఉష్ణోగ్రతలు 38 నుంచి 41 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశం ఉందట. రానున్న 2-3 రోజులు ఈ ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉంది. కాబట్టి పగటి పూట అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లొద్దని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. వాయవ్య దిశ నుంచి తెలంగాణ వైపుకు గాలులు వీస్తున్నాయని వాతావరణ శాఖ అధికారులు వివరించారు.
Also Read: Nitish Rana Fine: గెలిచిన ఆనందంలో ఉన్న కేకేఆర్‌కు భారీ షాక్.. ఇంపాక్ట్ ప్లేయర్ సహా అందరికీ కోత!
Also Read: MS Dhoni-Sunil Gavaskar: చివరి మ్యాచ్ ఆడేసిన ఎంఎస్ ధోనీ.. ఆటోగ్రాఫ్ తీసుకున్న భారత క్రికెట్ దిగ్గజం!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.