Vaccination of children: పిల్లల టీకాకు రిజిస్ట్రేషన్లు ప్రారంభం- స్లాట్ ఎలా బుక్ చేసుకోవాలంటే..
Vaccination of children: దేశంలో పిల్లల టీకాకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. 15 నుంచి 18 ఏళ్లలోపు పిల్లలకు సోమవారం నుంచి టీకా కార్యక్రమం ప్రారంభం కానుంది.
Vaccination of children: 15 ఏళ్ల నంచి 18 ఏళ్ల లోపు పిల్లలకు వ్యాక్సిన్ ఇచ్చేందుకు కేంద్రం కసరత్తు ముమ్మరం (vaccine for kids) చేసింది. ఇందులో భాగంగా నేటి నుంచి (2022 జనవరి 1) కొవిన్ యాప్, వెబ్సైట్లలో పిల్లల టీకా కోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియ (Children vaccine registration) ప్రారంభమైంది. రిజిస్ట్రేషన్ చేసుకున్న అర్హులకు సోమవారం నుంచి టీకా ఇవ్వనున్నారు ఆరోగ్య సిబ్బంది. ప్రస్తుతం కొవాగ్జిన్‌కు మాత్రమే పిల్లలకు ఇచ్చేందుకు అనుమతి ఉంది.
రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఇలా..
పెద్దల వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్ చేసినట్లుగానే పిల్లకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా ఉంటుంది.
ముందుగా కొవిడ్ యాప్ లేదా పోర్టల్‌లోకి వెళ్లి ఫోన్ నంబర్ ఎంటర్ చేయాలి (తల్లి దండ్రుల ఫోన్ నంబర్లను ఇవ్వొచ్చు).
ఒకే నంబర్‌పై నాలుగు రిజిస్ట్రేషన్లకు అనుమతి ఉంది. అంటే.. తల్లి దండ్రులు ఇద్దరూ ఒకే ఫోన్ నంబర్‌ను వినియోగించి.. టీకా తీసుకున్నా మరో ఇద్దరికి అదే ఫోన్ నంబర్ వినియోగించే వీలుంది.
ఓటీపీ ద్వారా ఫోన్ నంబర్‌ను ధృవీకరించిన తర్వాత రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమవుతుంది.
రిజిస్ట్రేషన్ పేజీలో టీకా తీసుకునే వారి పేరు, పుట్టిన తేదీ, జెండర్ వంటి వివరాలు నమోదు చేయాలి. ఆధార్ ద్వారా రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది.
రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయిన తర్వాత టీకా షెడ్యూల్‌ను ఎంచుకోవాల్సి ఉంటుంది. అంటే టీకా ఎప్పుడు తీసుకోవాలనుకుంటున్నారో (జనవరి 3 నుంచి ఆ తర్వాత) ఆ తేదీని ఎంచుకోవాల్సి ఉంటుంది.
దగ్గర్లోని వ్యాక్సినేషన్ సెంటర్‌కు వెళ్లి కూడా రిజిస్ట్రేషన్ చేసుకునే వీలుంది.
గత నెలలోనే పిల్లల టీకాకు అనుమతి..
గత నెల 25వ తేదీన ప్రధాని మోదీ జాతినుద్దేశించి ప్రసంగించారు. ఇందులో జనవరి 3 నుంచి పిల్లలకు టీకా కార్యక్రమం ప్రారంభం కానున్నట్లు తెలిపారు. పాఠశాలలు సాధార స్థితిక వస్తుండటంతో.. పిల్లల తల్లిదండ్రుల్లో ఆందోళన తొలగించేలా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.
పెద్దలకు (అర్హులైన వారికి మాత్రమే) మూడో డోసు టీకాపై కూడా ప్రకటన చేశారు. దేశంలో దీనిని బూస్టర్ డోసుగా కాకుండా.. ముందు జాగ్రత్త టీకాగా పిలువనున్నట్లు తెలిపారు ప్రధాని మోదీ.
Also read: Corona cases in India: ఒక్క రోజులో 22,700 కరోనా కేసులు, 406 మరణాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook