Remal Cyclone live updates: రెమాల్ తుపాను పశ్చిమ బెంగాల్‌పై విరుచుకుపడుతోంది. నిన్న అర్ధరాత్రి దాటిన తరువాత పశ్చిమ బెంగాల్ బంగ్లాదేశ్ సరిహద్దులో తీరం దాటింది. నిన్నట్నించి ఇటు పశ్చిమ బెంగాల్ అటు బంగ్లాదేశ్‌లో అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. తీరం దాటే సమయంలో గంటకు 140 కిలోమీటర్ల వరకూ పెనుగాలులు బీభత్సం సృష్టించాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రెమాల్ తుపాను ప్రస్తుతం ఉత్తర బంగాళాఖాతంలో కేంద్రీకృతమై ఉండి గంటకు 16 కిలోమీటర్ల వేగంతో ఉత్తరం వైపుకు దూసుకెళ్తూ తీరం దాటింది. పశ్చిమ బెంగాల్-బంగ్లాదేశ్ సరిహదద్దుల్ని రెమాల్ తుపాను దాటుతున్న దృశ్యాల్ని ఐఎండీ కోల్‌కతా రాడార్ బంధించింది. రెమాల్ తుపాను కారణంగా పశ్చిమ బెంగాల్ అతలాకుతలమౌతోంది. గంటకు 130-140 కిలోమీటర్ల వేగంతో తీరం వెంబడి గాలులు వీస్తున్నాయి. సముద్రం అల్లకల్లోలంగా ఉంది. ఇప్పటికే తీర ప్రాంతాల్నించి దాదాపుగా 1.20 లక్షలమందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఉత్తర, దక్షిణ పరగణాల జిల్లాలకు నష్టం అత్యధికంగా ఉండవచ్చని అంచనా. ఇప్పటికే ఈస్టర్న్ రైల్వే, సౌత్ ఈస్టర్న్ రైల్వే పరిధిలో కొన్ని రైళ్లు రద్దు చేశారు. కోల్‌కతా విమానాశ్రయం లో 21 గంటల వరకూ మొత్తం 394 విమాన సర్వీసుల్ని రద్దు చేశారు. 


అటు బంగ్లాదేశ్‌లోని పేరా, మోంగ్లా పోర్టుల్లో అత్యంత ప్రమాదకరమైన 10 వ నెంబర్ సూచీ జారీ చేశారు. కోక్స్ బజార్, చిట్టోగ్రామ్ పోర్టుల్లో 9వ నెంబర్ హెచ్చరిక జారీ అయింది. ఇక సముద్రంలోని కెరటాలు సాధారణం కంటే 8-10 అడుగుల ఎత్తులో ఎగసిపడుతున్నాయి. చిట్టగాంగ్ ఎయిర్‌పోర్టులో కూడా విమాన సర్వీసులు రద్దయ్యాయి. రెమాల్ తుపాను కారణంగా రానున్న48 గంటల్లో పశ్చిమ బెంగాల్, ఒడిశాలో అతి భారీ వర్షాలు పడనున్నాయి. అస్సోం, మేఘాలయ, మణిపూర్, త్రిపుర, అరుణాచల్ ప్రదేశ్ , నాగాలాండ్ రాష్ట్రాల్లో తుపాను ప్రభావం ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. 


Also read: Remal Cyclone Alert: ఇవాళ తీరం దాటనున్న రెమల్ తుపాను, ఏపీలో రెండ్రోజులు వర్షసూచన



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook