Remdesivir Injection: కరోనా చికిత్సలో కీలకంగా ఉపయోగిస్తూ..దేశవ్యాప్తంగా కొరత ఏర్పడి చర్చనీయాంశమైన డ్రగ్ రెమ్‌డెసివిర్. నిన్నటి వరకూ రెమ్‌డెసివిర్ పంపిణీ బాథ్యత కేంద్ర ప్రభుత్వానిదే. ఇప్పుడు మాత్రం బాథ్యతల్నించి తప్పుకుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దేశంలో రెమ్‌డెసివిర్ ఇంజక్షన్లకు(Remdesivir Injections) తీవ్ర కొరత ఏర్పడటం, బ్లాక్‌లో విక్రయించడం గత కొద్దిరోజులుగా చూస్తున్నాం. కరోనా చికిత్సలో కీలకంగా భావించే రెమ్‌డెసివిర్ కోసం దేశం యావత్తూ ఎదురుచూసిన పరిస్థితి. రెమ్‌డెసివిర్‌కు ఉన్న ప్రాధాన్యత దృష్ట్యా అన్ని రాష్ట్రాలకు సక్రమంగా అందించాలనే ఉద్దేశ్యంతో కేంద్ర ప్రభుత్వమే (Central government)పంపిణీ బాధ్యతను తీసుకుంది. ప్రస్తుతం రెమ్‌డెసివిర్‌ రోజువారీ ఉత్పత్తులు పెరిగినందున కేంద్ర ప్రభుత్వం రెమ్‌డెసివిర్ పంపిణీ బాధ్యతల్నించి తప్పుకుంటున్నట్టు  ప్రకటించింది. ఈ మేరకు కేంద్ర కెమికల్స్‌, ఫెర్టిలైజర్స్‌ మంత్రి మన్‌సుఖ్‌ మందావియా ప్రకటన చేశారు. ఇకపై రెమ్‌డెసివర్‌ పంపిణీ బాధ్యతలను పర్యవేక్షించాల్సిందిగా నేషనల్‌ ఫార్మాస్యూటికల్‌ ప్రైసింగ్‌ ఏజెన్సీ, సీడీఎస్‌సీవోలను ఆయన ఆదేశించారు.


ఏప్రిల్ 15 నాటికి దేశంలో రోజుకు 33 వేల రెమ్‌డెసివిర్ వయల్స్ తయారవడంతో డిమాండ్ ఎక్కువగా ఉండేది. ఫలితంా మే 8వ తేదీ నుంచి రెమ్‌డెసివిర్ తయారీ కంపెనీ నుంచి కేంద్రమే నేరుగా కొనుగోలు చేసేది. ఇప్పుడీ ఇంజక్షన్ కొరతను అధిగమించేందుకు ఈ ఇంజక్షన్ ఉత్పత్తి ప్లాంట్లను 20 నుంచి 60కు పెంచారు. గత కొద్దిరోజుల్నించి రెమ్‌డెసివిర్ ఉత్పత్తి (Remdesivir production)పెరగడంతో కేంద్రం పంపిణీ బాధ్యతల్నించి తప్పుకున్నట్టుంది. మరోవైపు కరోనా చికిత్స నుంచి రెమ్‌డెసివిర్ ఇంజక్షన్‌ను ఐసీఎంఆర్ (ICMR) తొలగించింది.


Also read: Flight Charges: విమానయాన ఛార్జీల్లో భారీగా పెరుగుదల


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook