COVID-19 drugs: ప్రిస్క్రిప్షన్ లేనిదే ఇవి విక్రయించరాదు
COVID-19 medicine: న్యూ ఢిల్లీ: కొవిడ్-19 చికిత్సకు ఉపయోగిస్తున్న రెమిడిసివిర్, టొసిలిజుమాబ్, ఫెవిపిరవిర్ వంటి ఔషధాలను మెడికల్ ప్రిస్క్రిప్షన్ లేకుండా విక్రయించరాదని ఢిల్లీ సర్కార్ ( Delhi govt ) స్పష్టంచేసింది. ఈ మేరకు ఢిల్లీ డ్రగ్స్ కంట్రోల్ విభాగం డ్రగ్స్ కంట్రోలర్స్‌కి ఆదేశాలు జారీచేసింది.
COVID-19 medicine: న్యూ ఢిల్లీ: కొవిడ్-19 చికిత్సకు ఉపయోగిస్తున్న రెమిడిసివిర్, టొసిలిజుమాబ్, ఫెవిపిరవిర్ వంటి ఔషధాలను మెడికల్ ప్రిస్క్రిప్షన్ లేకుండా విక్రయించరాదని ఢిల్లీ సర్కార్ ( Delhi govt ) స్పష్టంచేసింది. ఈ మేరకు ఢిల్లీ డ్రగ్స్ కంట్రోల్ విభాగం డ్రగ్స్ కంట్రోలర్స్‌కి ఆదేశాలు జారీచేసింది. కరోనావైరస్ చికిత్సకు ఉపయోగిస్తున్న ఈ మెడిసిన్ బ్లాక్ మార్కెట్‌కి తరలిపోయే ప్రమాదం ఉన్నందున.. వీటి విక్రయాలపై ఓ కన్నేసి పెట్టాల్సిందిగా డ్రగ్స్ కంట్రోల్ విభాగం తమ ఆదేశాల్లో పేర్కొంది. అత్యవసర వైద్య పరిస్థితుల్లో మాత్రమే ఈ డ్రగ్స్ ఉపయోగించాలని కేంద్రం స్పష్టంచేసిందనే విషయాన్ని ఈ సందర్భంగా ఢిల్లీ డ్రగ్స్ కంట్రోల్ విభాగం సంబంధిత అధికారులకు గుర్తుచేసింది. ( Also read: COVID-19 vaccine: కోవిడ్-19 వ్యాక్సిన్‌పై స్పష్టత వచ్చేసింది ).
దేశంలో ప్రస్తుతానికి హెటిరో ల్యాబ్స్ లిమిటెడ్, సిప్లా లిమిటెడ్ కంపెనీలకు మాత్రమే ఈ కోవిడ్-19 డ్రగ్స్‌ని తయారు చేస్తున్నాయి.