Republic Day 2022- PM Modi Pays Tribute: 73వ గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అమరవీరులకు నివాళులు అర్పించారు. ఢిల్లీలో కొత్తగా నిర్మించిన నేషనల్ వార్ మెమోరియల్ ఎదుట బుధవారం ఉదయం చేరుకున్న ఆయన దేశం కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరులకు సంతాపాన్ని ప్రకటించారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ కార్యక్రమంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, రక్షణ శాఖ సహాయ మంత్రి అజయ్ భట్, రక్షణ కార్యదర్శి అజయ్ కుమార్ తో పాటు ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ విభాగాల అధిపతులు కూడా పాల్గొన్నారు.



నేషనల్ వార్ మెమోరియల్ ముందు పుష్పగుచ్ఛం ఉంచిన ప్రధానమంత్రి నరేంద్రమోదీ.. ఆ తర్వాత రెండు నిమిషాల మోనం పాటించారు. ఆ తర్వాత గణతంత్ర దినోత్సవం సందర్భంగా త్రివిధ దళాలు ఏర్పాటు చేసే పరేడ్ ను చూసేందుకు రాజ్ పథ్ కు వెళ్లారు. 


73వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ దేశానికి నాయకత్వం వహిస్తారు. గణతంత్ర దినోత్సవం 75వ స్వాతంత్య్ర సంవత్సరం సందర్భంగా దేశవ్యాప్తంగా 'ఆజాదీ కా అమృత్ మహోత్సవ్'గా జరుపుకుంటున్నందున ఈ ఏడాది జరుగుతోన్న వేడుకలు ప్రత్యేకమైనవిగా భావిస్తున్నారు. 



రిపబ్లిక్ డే వేడుకలను ఇకపై ప్రతి ఏడాది జనవరి 23 నుంచి 30 అనగా వారం రోజుల పాటు నిర్వహించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ వేడుకలు గొప్ప స్వాతంత్ర్య సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి అయిన జనవరి 23న ప్రారంభం కానున్నాయి. అదే విధంగా జనవరి 30న అమరవీరుల దినోత్సవంగా నిర్వహించడం జరుగుతోంది. 


Also Read: Padma awards 2022: పద్మ పురస్కారాలు ప్రకటించిన కేంద్రం.. బిపిన్ రావత్, కృష్ణ ఎల్లా, నీరజ్ చోప్రా ఎంపిక


Also Read: Republic Day Significance: జనవరి 26న రిపబ్లిక్ డేను ఎందుకు జరుపుకొంటారో తెలుసా?


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.