Republic Day 2023: గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు దేశవ్యాప్తంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. దేశ రాజధానిలో ఢిల్లీలోనూ సన్నాహాలు జోరుగా ప్రారంభమయ్యాయి. ఈ ఏడాది గణతంత్ర దినోత్సవం చాలా ప్రత్యేకం కాబోతోంది. ఈ వేడుకల్లో మొత్తం 50 విమానాలు పాల్గొనబోతున్నాయని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ఈసారి నేవీకి చెందిన ఐఎల్ 38 కూడా ఇందులో చేరనుంది. ఐఎల్ 38 భారత నావికాదళానికి చెందిన సముద్ర నిఘా విమానం కావడం విశేషం. ఇది గత 42 సంవత్సరాలు కిందట నేవీలో చేరింది. అప్పటి నుంచి ఏకధాటిగా సేవలు అందిస్తోంది. ఈ విమానం ఈ ఏడాది రిపబ్లిక్ వేడుకల్లో పాల్గొనడం ప్రత్యేకమని ఎయిర్ ఫోర్స్ అధికారులు చెబుతున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రిపబ్లిక్ డే వేడుకల్లో మొదటిసారిగా.. బహుశా చివరిసారిగా ఐఎల్ 38 ప్రదర్శిస్తున్నట్లు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అధికారి ఒకరు చెప్పారు. వేడుకల్లో మొత్తం 50 విమానాలు పాల్గొంటాయన్నారు. ఈ 50 విమానాల్లో నాలుగు ఆర్మీ విమానాలు ఉంటాయని ఆయన చెప్పారు.




ఈ వేడుకలో ఈజిప్టు సైనిక బృందం కూడా పాల్గొనబోతోంది. రిపబ్లిక్ డే వేడుకలకు ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్ ఫత్తా అల్-సిసి ముఖ్య అతిథిగా హాజరవుతారని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నవంబర్‌లోనే తెలిపింది. గణతంత్ర దినోత్సవానికి అరబ్ రిపబ్లిక్ ఆఫ్ ఈజిప్ట్ అధ్యక్షుడు ముఖ్య అతిథిగా రావడం ఇదే తొలిసారి అని మంత్రిత్వ శాఖ ప్రకటనలో తెలిపింది.




ఈ వేడుకలను వీక్షించేందుకు ఆన్‌లైన్‌లో టిక్కెట్లు అందుబాటులో ఉన్నాయి. రిపబ్లిక్ డే వేడుకలను ప్రత్యక్షంగా వీక్షించాలనుకునే వారు amantarn.mod.gov.in  వెబ్‌సైట్‌లో బుక్ చేసుకోవచ్చు. టిక్కెట్‌లను కొనుగోలు చేయడమే కాకుండా.. ఆహ్వాన కార్డ్‌లు, అడ్మిట్ కార్డ్‌లు, కార్ పార్కింగ్ లేబుల్‌లను కూడా ఇక్కడ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. 


Also Read: UP Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి.. పోలీసులపై రాళ్లు విసిరిన స్థానికులు  


Also Read:  Ind VS New Zealand: మూడో వన్డే నుంచి సీనియర్లకు రెస్ట్.. ఆ ప్లేయర్ ఎంట్రీ కన్ఫార్మ్.. తుది జట్టు ఇదే..!  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి