Ind VS New Zealand: మూడో వన్డే నుంచి సీనియర్లకు రెస్ట్.. ఆ ప్లేయర్ ఎంట్రీ కన్ఫార్మ్.. తుది జట్టు ఇదే..!

Ind VS New Zealand 3rd Odi Prediction: టీమిండియా ప్రయోగాలకు సిద్ధమవుతోంది. న్యూజిలాండ్‌పై వరుసగా రెండు వన్డేలు గెలిచి సిరీస్ సొంతం చేసుకున్న భారత్.. మూడో వన్డే నుంచి సీనియర్లకు విశ్రాంతి ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. రిజర్వ్ బెంచ్‌ను పరీక్షించేందుకు ఇదే మంచి ఛాన్స్ అని క్రికెట్ నిపుణులు చెబుతున్నారు.   

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 23, 2023, 10:04 AM IST
Ind VS New Zealand: మూడో వన్డే నుంచి సీనియర్లకు రెస్ట్.. ఆ ప్లేయర్ ఎంట్రీ కన్ఫార్మ్.. తుది జట్టు ఇదే..!

Ind VS New Zealand 3rd Odi Prediction: ఈ ఏడాది టీమిండియా మంచి జోరు మీద ఉంది. వరుసగా రెండో వన్డే సిరీస్‌ క్లీన్ స్వీప్ చేసేందుకు రెడీ అవుతోంది. కివీస్‌పై ఇప్పటికే రెండు వన్డేలు గెలిచిన భారత్.. రేపు జరగబోయే మూడో మ్యాచ్‌లోనూ విజయం సాధించాలని చూస్తోంది. ఇండియా, న్యూజిలాండ్ జట్ల మధ్య చివరి మ్యాచ్ మంగళవారం (జనవరి 24) ఇండోర్‌లోని హోల్కర్ స్టేడియంలో జరగనుంది. ఇప్పటికే ఈ మ్యాచ్ కోసం ఇరు జట్లు ఇండోర్ చేరుకున్నాయి. చివరి మ్యాచ్‌లో అయినా గెలిచి పరువు కాపాడుకోవాలని ప్రత్యర్థి జట్టు చూస్తోంది. 

ఇప్పటికే సిరీస్‌ సొంతం అవ్వడంతో చివరి మ్యాచ్‌కు సీనియర్లకు విశ్రాంతి ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. రెండో వన్డేలో భారత్ విజయం సాధించిన అనంతరం కెప్టెన్ రోహిత్ శర్మ కూడా చివరి మ్యాచ్‌లో కొంతమంది ఆటగాళ్లకు విశ్రాంతి ఇవ్వవచ్చని హింట్ ఇచ్చాడు. ఫిబ్రవరి 9 నుంచి ఆస్ట్రేలియాతో టీమిండియా నాలుగు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ ఆడాల్సి ఉంది. ఈ నేపథ్యంలో చాలా మంది సీనియర్ ఆటగాళ్లు మూడో వన్డేకు రెస్ట్ తీసుకోవచ్చు. 

మూడో వన్డే నుంచి మహ్మద్‌ షమీ, శుభ్‌మన్‌ గిల్‌, విరాట్‌ కోహ్లీలకు విశ్రాంతి ఇవ్వవచ్చని క్రికెట్‌ నిపుణులు చెబుతున్నారు. రిజర్వ్ బెంచ్‌ను పరీక్షించేందుకు ఇదో మంచి అవకాశం అని అంటున్నారు. గిల్‌కు విశ్రాంతి ఇస్తే.. ఇషాన్ కిషన్‌ను ఓపెనింగ్ చేస్తాడు. మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ రజత్ పాటిదార్‌కు అరంగేట్రం చేసే ఛాన్స్ ఉంది. కింగ్ కోహ్లీ స్థానంలో అతను మూడో స్థానంలో ఆడగలడు. షాబాద్ అహ్మద్, స్పీడ్ స్టార్ ఉమ్రాన్ మాలిక్ తుది జట్టులోకి వచ్చే అవకాశం కనిపిస్తోంది.

టీమిండియా తుది జట్టు (అంచనా): ఇషాన్ కిషన్, రోహిత్ శర్మ (కెప్టెన్), రజత్ పటీదార్, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, షాబాజ్ అహ్మద్, వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, ఉమ్రాన్ మాలిక్, మహ్మద్ సిరాజ్.

Also Read:  Bandi Sanjay: పసిపిల్లలు ఏడుస్తున్నా నీ మనసు కరగడం లేదా కేసీఆర్.. మానవత్వం లేని మృగానివి: బండి సంజయ్

Also Read:  Air India Offers: ఫ్లైట్ టికెట్స్‌పై బంపర్ ఆఫర్.. ఎయిర్ ఇండియా రిపబ్లిక్ డే సేల్  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News