Republic Day 2023: దేశమంతా 74వ గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకోవడానికి రెడీ అయింది. భారతదేశం ప్రతి ఏటా జనవరి 26న రిపబ్లిక్ డే వేడుకలను జరుపుకుంటుంది. ప్రతి సంవత్సరం లాగానే ఈ ఏడాది కూడా రిపబ్లిక్ డే పరేడ్‌లో తన సైనిక పాటవాన్ని ప్రదర్శించేందుకు సిద్దమైంది. ముఖ్యంగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఆధునాతన ఫైటర్ జెట్లతో విన్యాసాలు చేయడానికి ఉవ్విళ్లూరుతోంది. ఈసారి 9 రాఫెల్‌లతో సహా 57 విమానాలను ప్రదర్శిస్తుంది. ఇందులో తేజస్, సుఖోయ్ వంటి యుద్ద విమానాలు ఉన్నాయి. భారత వైమానిక దళం ఉపయోగించే ఆధునాతన యుద్ధ విమానాలేంటో ఓ సారి చూద్దాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రాఫెల్
ఫ్రాన్స్ కు చెందిన డస్సాల్ట్ సంస్థ రాఫెల్ యుద్ధ విమానాలను తయారుచేస్తుంది. ఆ సంస్థ నుంచి 36 అత్యాధునిక రాఫెల్‌ జెట్‌ ఫైటర్స్‌ ను మోదీ ప్రభుత్వం కొనుగోలు చేసింది. వీటి భారత రెండు స్క్వాడ్రన్‌లను ఏర్పాటు చేసింది. రాఫెల్ మెుదటి స్క్వాడ్రన్‌ను అంబాలా ఎయిర్ ఫోర్స్ స్టేషన్‌లో మోహరించింది. 
 తేజస్
మేక్ ఇన్ ఇండియాలో భాగంగా తేజస్ లైట్ కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ ను తయారుచేసింది హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్. సోవియట్ కు చెందిన మిగ్-21 స్థానంలో వీటిని ప్రవేశపెట్టింది. వీటిని విదేశాలకు కూడా ఎగుమతి చేయడం ప్రారంభించింది భారత ప్రభుత్వం. అత్యంత అధునాతన జెట్‌లలో ఇది కూడా ఒకటి.
సుఖోయ్ సు-30MKI
భారతదేశంలో అత్యంత అధునాతన యుద్ధ విమానాల్లో సుఖోయ్ సు-30MKI. రష్యా సహకారంతో హెచ్ఏఎల్ దీనిని తయారు చేసింది. దీనిని ఫ్లాంకర్ అని పిలుస్తారు. భారత వైమానిక దళం ఇది కీలక ఫైటర్ జెట్. 


మిరాజ్-2000
బాలాకోట్ స్ట్రైక్స్ లో ఈ యుద్ధ విమానాన్ని వినియోగించింది భారత్. మిరాజ్-2000 కూడా 1999 కార్గిల్ యుద్ధంలో కీలకపాత్ర పోషించింది. 
మిగ్-29
భారత్ దీనిని విదేశాల నుంచి దిగుమతి చేసుకుంది. దీనిని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మరియు ఇండియన్ నేవీ రెండింటికీ ఉపయోగిస్తుంది. IAF ప్రస్తుతం అప్‌గ్రేడ్ చేసిన MiG-29 UPGని ఉపయోగిస్తోంది మరియు కార్గిల్ యుద్ధ సమయంలో లేజర్-గైడెడ్ బాంబులతో మిరాజ్-2000 దాడి చేసే లక్ష్యాలకు ఎస్కార్ట్ అందించడానికి ఉపయోగించారు. 


Also Read: President Droupadi Murmu Speech: గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.. జాతిని ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగం



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook