దేశరాజధాని ఢిల్లీలో వైభవోపేతంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు ప్రారంభమయ్యాయి. ప్రధాని నరేంద్ర మోదీ, భారత రాష్ట్రపతి రామనాథ్ కోవింద్‌ను సాదరంగా ఆహ్వానించి, వేడుకలకు శ్రీకారం పలికారు. 



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తర్వాత భారత జాతీయ గీతాన్ని ఆలపించిన సమయంలోనే 21 గన్ సెల్యూట్‌తో వందనాన్ని స్వీకరించాక, సెల్యూట్ స్వీకరించి రాష్ట్రపతి జాతీయ జెండాని ఎగురవేశారు.



ఆ తర్వాత అమరులైన సైనికుల కుటుంబాలకు పురస్కారాలను ప్రదానం చేశారు.



అమరుడైన ఐఏఎఫ్ కమెండో జెపీ నిరాలాకు అశోక్ చక్ర మెడల్‌ను రాష్ట్రపతి ప్రదానం చేశారు. జెపీ నిరాలా బందిపుర ఎన్‌కౌంటర్‌లో మరణించిన జవాన్. 



ఆ తర్వాత కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ అసిత్ మిస్త్రీ రిపబ్లిక్ డే పరేడ్‌ను లీడ్ చేశారు. 



ఆ తర్వాత భారత ఆర్మీ అధికారులు పది దక్షిణాసియా దేశాల జాతీయ జెండాలను మోసుకుంటూ పరేడ్ గ్రౌండ్‌లోకి వచ్చారు.



గణతంత్ర దినోత్సవ ఉత్సవాలలో భాగంగా మిలట్రీ నైపుణ్యాలను ప్రదర్శించారు



అలాగే బ్రహ్మోస్ మిసైల్ సిస్టమ్‌‌ను ప్రదర్శించారు



డోగ్రా రెజిమెంట్ సైనికులు ఆ తర్వాత తమ నైపుణ్యాలను ప్రదర్శించారు.