Fact Check: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ( Reserve Bank of India )..పాత నోట్లను మరోసారి రద్దు చేయనుందంటూ వస్తున్న వార్తలపై క్లారిటీ వచ్చింది. వంద రూపాయు, పది, ఐదు రూపాయల పాత నోట్లను ఆర్బీఐ రద్దు చేయనుందా.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


డీ మోనిటైజేషన్‌ ( Demonetisation )ను దేశ ప్రజలు ఇప్పటికీ మర్చిపోలేదు. ఇప్పుడు మరోసారి అటువంటి వార్తలు వస్తుండటంతో ఆందోళనకు గురవుతున్నారు జనం. ఆర్బీఐ..వంద, పది, ఐదు రూపాయల పాతనోట్లను ( Old Notes ) రద్దు చేస్తుందంటూ గత కొద్ది కాలంగా వార్తలు వస్తున్నాయి. దేశ ప్రజల్లో ఈ విషయమై ఆందోళన నెలకొనడంతో ఆర్బీఐ స్పందించింది. ట్విట్టర్ వేదికగా ఈ  విషయంపై క్లారిటీ ఇచ్చింది. వంద, పది, ఐదు రూపాయల పాతనోట్లను చలామణీలోంచి తీసివేస్తున్నట్టు వస్తున్న వార్తల్ని ఖండించింది. ఆ వార్తలన్నీ తప్పుడు వార్తలుగా స్పష్టం చేసింది. 2021 మార్చ్ నెలలోగా పాత నోట్లను రద్దు చేస్తున్నట్టుగా వార్తలు వైరల్ అవుతున్న విషయం తెలిసిందే.


ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఈ విషయంపై ట్విట్టర్ ద్వారా స్పష్టత ఇచ్చింది. ఇదంతా ఫేక్ న్యూస్ అని కొట్టిపారేసింది ఆర్బీఐ ( RBI ). అటువంటి ఏ నిర్ణయాలు తీసుకోలేదని స్పష్టం చేసింది. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపింది. 


Also read: RBI Big Decision: పెన్షనర్లకు చేసిన అదనపు పెన్షన్ రికవరీపై RBI కీలక నిర్ణయం


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook