Video: దేశ సాంప్రదాయానికి అవమానం.. చీర కట్టుకుందని హోటల్ కు నో ఎంట్రీ..! నెటిజన్లు ఆగ్రహం
ఢిల్లీలోని ఒక రెస్టారెంట్‌లో, మహిళ చీర కట్టుకున్నందుకు ప్రవేశం అనుమతించబడదు. చీర స్మార్ట్ క్యాజువల్ కాదని హోటల్ సిబ్బంది చెప్పిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియో చూసి తీవ్రంగా విమర్శిస్తున్న నెటిజన్లు....
Restaurant Denies Entry to Woman in Saree: చీర కట్టు భారత దేశ సాంప్రదాయంలో (Indian Tradition) ప్రాముఖ్యమైంది. విదేశస్థులు గౌరవించే చీర కట్టు సాంప్రదాయాన్ని మన దేశ ప్రజలు, రెస్టారెంట్లు గౌరవించకపోవటం సిగ్గు చేటు. దీనికి సంబంధించిన ఒక వీడియో తెగ వైరల్ (Viral Video) అవటమే కాకుండా, ఆ హోటల్ యాజమాన్యం పై నెటిజన్లు ఆగ్రహానికి లోనవుతున్నారు.
ఈ ఘటన ఢిల్లీలోని (Delhi) ఒక రెస్టారెంట్ లో చోటు చేసుకుంది. చీర కట్టుకొని రెస్టారెంట్ కు వచ్చిన మహిళకు అనుమతి ఇవ్వకుండా, చీర స్మార్ట్ అండ్ క్యాజువల్‌గా పరిగనించబడదని చెప్పటం... చీర కట్టుకున్న యువతి ఆ వీడియోని ట్విట్టర్ లో పోస్ట్ చేయటం.... దేశ సాంప్రదాయానికి ఇది అవమానం అని నెటిజన్లు వాపోతున్నారు.
Also Read: Viral video: అధికార మదం...గ్రామ సమస్యల గురించి అడిగితే బూటుకాలితో తన్నిన సర్పంచ్.!
సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియోలో చీర కట్టుకొని వచ్చిన యువతిని రెస్టారెంట్‌లో, సిబ్బంది లోపలికి వెళ్లనివ్వకుండా (Restaurant Denies Entry to Woman in Saree) అడ్డుకుంటారు. ఎందుకు అని ఆ యువతి అడిగితే, చీర కట్టుకుంటే అనుమతి లేదని సిబ్బంది తెలపటం, చీర కట్టుకుంటే లోపలికి అనుమతి లేదని ఎక్కడ రాసి ఉందని, రాత పూర్వకంగా రాసి ఇవ్వండని ఆ మహిళ సిబ్బందిని అడిగింది.
దానికి ఎలాంటి సమాధానం చెప్పలేక సిబ్బంది వెళ్లిపోవటం.. సోషల్ మీడియాలో ఈ వీడియో చూసిన నెటిజన్లు తీవ్ర కోపానికి గురి అవుతున్నారు. వీడియో పోస్ట్ చేసిన కాసేపటికే వైరల్ అవ్వగా.. వేలల్లో కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు.
Also Read: IPL 2021: ఐపీఎల్‌ను వెంటాడుతున్న కోవిడ్ 19... SRH ప్లేయర్ నటరాజన్ కు కరోనా పాజిటివ్..!
వీడియో చూసిన షెఫాలీ వైద్య అనే యువతి... "చీర 'స్మార్ట్ వేర్' కాదని నిర్ణయించేది ఎవరు..?? యుఎస్ (US), యుఎఇ (UAE), యుకెలోని (UK) బెస్ట్ రెస్టారెంట్లలో చీర కట్టుకునే వెళ్లాను. నన్ను ఎవరు అడ్డగించలేదు... పొరుగు దేశాలన్నీ చీరను కట్టును చూడగానే భారతదేశ సాంప్రదాయంగా భావించి, గౌరవిస్తారని, మన దేశంలో ఇలా జరగటం ఏంటని.. ఇప్పటి వరకు నేను చూడని పెద్ద వింత" అని ఆమె పోస్ట్ చేసారు.
"స్మార్ట్ వేర్ అంటే ఏంటి.. ?? క్రిస్టియన్-ముస్లిం దేశాలలో (Christian-Muslim Countries) కూడా చీరపై అలాంటి నిషేధం లేదు, మరీ మన దేశంలో అలాంటి మనస్తత్వం ఎందుకు ఉంది. అదే విధంగా దేశ సంప్రదాయాన్ని అవమానించిన మీ రెస్టారెంట్ రేటింగ్ చూసుకోండి. మీరు ఇలా తప్పులు చేయటం మొదటి సారి కాదు.. ఇప్పటికి చాలా సార్లు జరిగాయని" మరో యూజర్ తన అభిప్రాయాన్ని తెలిపాడు.
Also Read: Rana Naidu : రానా కల నేరవేరిందట.. బాబాయ్‌తో కలిసి నటించనున్న అబ్బాయి
ఈ వీడియో పోస్ట్ చేసేపుడు అనితా చౌదరి (Anita Chaudhary) హోంమంత్రి అమిత్ షా (Home Minister Amit Shah) మరియు మహిళా కమిషన్‌ని (Women's Commission) కూడా ట్యాగ్ చేస్తూ, ఇక నుండి మహిళలు చీర కట్టుకోవడం మానేయాలా అని ప్రశ్నించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి