Mumbai mini Lockdown: ముంబయిలో మినీ లాక్డౌన్.. త్వరలోనే నూతన మార్గదర్శకాలు..
Mumbai mini Lockdown: కరోనా కట్టడి చర్యలపై బృహన్ ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ వడివడిగా అడుగులు వేస్తోంది. నూతన కొవిడ్ ఆంక్షలపై ఇవాళ రాత్రి అధికారిక ప్రకటన (corona restrictions in mumbai) చేయనుంది.
Mumbai mini Lockdown: నగరంలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో బృహన్ ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) అప్రమత్తమైంది. నగరంలో కఠిన ఆంక్షలు (Mini Locd down in Mumbai) విధించనున్నట్లు తెలిపింది.
ముంబయిలో పూర్తి స్థాయి లాక్డౌన్ పెట్టబోమని మేయర్ కిశోరీ పడ్నేకర్ (No lockdwon in Mumbai) వెల్లడించారు. అయితే మినీ లాక్‌డౌన్‌ను తలపించేలా ఆంక్షలు మాత్రం (corona restrictions in mumbai) విధించనున్నట్లు స్పష్టం చేశారు. నూతన కొవిడ్ నిబంధనలపై నేడు (శుక్రవారం) రాత్రి 7 గంటలకు అధికారికంగా ప్రకటన వెలువడనున్నట్లు (Mumbai Mayor Kishori Pednekar) వివరించారు.
కరోనా నేపథ్యంలో ఇప్పటికే పశ్చిమ్ బెంగాల్లో (Mini lockdwon in West Bengal) లాక్డౌన్ తరహా ఆంక్షలు అమలులోకి వచ్చాయి. గురువారం నుంచి బిహార్ సైతం కఠిన ఆంక్షలు విధించింది.
హాస్పిటల్స్‌లో బెడ్స్ ఇలా..
బీఎంసీ పరిధిలోని ఆస్పత్రుల్లో అందుబాటులో ఉన్న బెడ్స్‌పై కూడా ప్రకటన చేశారు మేయర్. నగర వ్యాప్తంగా 22,000 సాధారణ పడకలు, 7 వేల ఐసీయూ బెడ్స్ అందుబాటులో (ICU Beds in Mumbai) ఉన్నట్లు వివరించారు.
కరోనా పరిస్థితులు ఇలా..
ముంబయిలో కరోనా కేసులు రోజు రోజుకు భారీగా (Corona in Mumbai) పెరుగుతున్నాయి. నిన్న ఒక్క రోజే ముంబయిలో 20,181 మందికి (Corona cases in Mumbai) పాజిటివ్‌గా తేలింది. నగరంలో మొత్తం యాక్టివ్ కరోనా కేసులు 79,260కి పెరిగినట్లు (Active Corona cases in Mumbai) బీఎంసీ ప్రకటించింది.
ఇక మహారాష్ట్ర మొత్తం మీద కూడా కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. గురువారం ఒక్క రోజే రాష్ట్రంలో 36,265 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా (Corona case in Maharashtra) మొత్తం 1,14,847 యాక్టివ్ కరోనా కేసులు ఉన్నట్లు (Active Corona cases) ఆరోగ్య విభాగం వెల్లడించింది.
ఇక దేశవ్యప్తంగా ఒమిక్రాన్ వేరియంట్ భయాలు కూడా వెంటాడుతున్నాయి. ఇప్పటికే ఒమిక్రాన్ కేసుల (Omicrona cases in India) సంఖ్య 3 వేలు దాటింది.
Also read: India Covid Cases Today: దేశంలో లక్ష దాటికి కరోనా కేసులు- 302 మరణాలు
Alsor read: Omicron Death: ఒమిక్రాన్ డేంజర్ బెల్స్.. కొత్త వేరియంట్‌తో దేశంలో రెండో మరణం...
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook