హైదరాబాద్: కరోనా వైరస్.. ఈ పేరు వినబడగానే ప్రతి ఒక్కరిలో వణుకు పుడుతుంది. గత వారం రోజుల క్రితం వరకు వరకు ప్రశాంతంగా ఉన్నా భారతదేశాన్ని ఇప్పుడు కరోనా భూతం కలవరపెడుతోంది. కాగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఎప్పటికప్పుడు సమాచారం సేకరించి, రాష్ట్ర ప్రభుత్వాలకు తగు విదంగా సూచనలు చేస్తోంది. ఇటు కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు కరోనాపై అత్యవసర పరిస్థితిని ప్రకటించాయి.
 

దీనికి సంబంధించి వైద్య నిపుణులు కొన్ని సూచనలు చేశారు.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

చేతులను పరిశుభ్రంగా ఉంచుకోవాలి.
వైరస్ ను  నాశనము చేయడానికి సబ్బుతో చేతులను క్రమం తప్పకుండా పూర్తిగా శుభ్రం చేసుకోవాలి. 
తుమ్ముతున్న వారి నుండి దూరంగా ఉండాలి. మాస్కులు ధరించాలి. 
కళ్ళు, ముక్కు, నోరు ఇతర ఇంద్రియాలను వేలుతో తాకకూడదు. 
అనేక చోట్ల చేతులు తాకుతాయి కాబట్టి వైరస్ ఎటాక్ అయ్యే అవకాశం ఉంటుందని దానికి తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. 
అనారోగ్యంగా ఉందని అనిపిస్తే ఇంట్లోనే ఉండాలని జన సమూహంలో తిరగకూడదు. 
జ్వరం, దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే, వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. 


COVID-19 ఎలా వ్యాపిస్తుందంటే..  


COVID-19, ఒక వ్యక్తికి ఎలా సోకుతుందంటే..  దగ్గు, తుమ్ము, శ్వాస తీసుకువడం ద్వారా ముక్కు, నోటి నుండి బిందువుల రూపం ఇతరులకు సోకే అవకాశం ఉందని వైద్యులు పేర్కొన్నారు. వస్తువులను తాకినప్పుడు ఒక వేళ వైరస్ సోకినా వ్యక్తి ఆ వస్తువును తాకినట్లైతే వెంటనే వ్యాపిస్తుందని తెలిపారు. వైరస్ సోకిన వ్యక్తి నుండి కనీసం 1 మీటర్ దూరం ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.