Robot Zafira to scan people for masks: తమిళనాడు: ప్రపంచమంతా కరోనావైరస్ (Coronavirus) వినాశనం సృష్టిస్తోంది. ఆరు నెలల నుంచి కోవిడ్ కారణంగా జనజీవనం స్తంభించిపోయింది. కరోనా భయంతో పక్కవారితో మాట్లాడటానికి జంకుతున్నారు. ఎందుకంటే.. కరోనా ఎవరికీ ఉందో ఎవరికీ లేదో మనకెవరికీ తెలియదు. ఈ క్రమంలో వ్యాపారలావాదేవీల పరిస్థితి మరి దారుణంగా మారింది. మాల్స్, దుకాణాలకు, షాపింగ్ కాంప్లెక్స్‌లకు వచ్చివెళ్లే కష్టమర్లందరినీ పరీక్షించడం కష్టం. కావున తమిళనాడుకు చెందిన తిరుచిరాపల్లిలోని ఓ వస్త్ర వ్యాపారి దుకాణానికి వచ్చే వినియోగాదారులను పరీక్షించడానికి ఏకంగా ఒక రోబోనే ఏర్పాటు చేశాడు. ఆ రోబో పేరు జాఫిరా ( robot Zafira ).. జాఫిరా కాంప్లెక్స్ లోపలికి వచ్చేవారందరినీ లెక్కించడమే కాకుండా.. కోవిడ్ నిబంధనలు పాటిస్తున్నారా లేదా అని క్షుణ్ణంగా పరిశీలిస్తుంది. ఇంకా.. వచ్చే వినియోగదారులంతా మాస్క్ ధరించారా? లేదా?.. చూసి వారి టెంపరేచర్‌ను చెక్ చేయడం.. శానిటైజర్ అందించడం లాంటి పనులను జాఫిరా నిర్వర్తిస్తోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

[[{"fid":"191681","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"robot zafira tiruchirapalli","field_file_image_title_text[und][0][value]":"తిరునాచుపల్లి రోబో"},"type":"media","field_deltas":{"3":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"robot zafira tiruchirapalli","field_file_image_title_text[und][0][value]":"తిరునాచుపల్లి రోబో"}},"link_text":false,"attributes":{"alt":"robot zafira tiruchirapalli","title":"తిరునాచుపల్లి రోబో","class":"media-element file-default","data-delta":"3"}}]]


ఈ జాఫిరా రోబో పనిచేసేవిధానం గురించి.. దీనిని తయారు చేసిన జాఫి రోబోట్స్ సీఈవో ఆశిక్ రెహమాన్ మాట్లాడుతూ.. దీనిని పూర్తి ఇంటిలిజెన్స్ వ్యవస్థతో రూపొందించామని చెప్పారు. కరోనా వినాశనం ప్రారంభమైన నాటినుంచి.. కార్మికులకు సహాయం చేయడానికి ఈ రోబోట్లను అభివృద్ధి చేశామని చెప్పారు. దీంతోపాటు.. దుకాణంలోకి ప్రవేశించే వారిని ట్రాక్ చేసి.. ప్రతిరోజూ యజమానులకు ఈ-మెయిల్ పంపుతుందని.. వ్యాపారస్థుల సౌలభ్యం కోసం దీనిని రూపొందించినట్లు ఆశిక్ రెహమాన్ వివరించాడు. 


[[{"fid":"191686","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"robot Zafira tamilnadu","field_file_image_title_text[und][0][value]":"రోబో సీఈవో రెహమాన్"},"type":"media","field_deltas":{"5":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"robot Zafira tamilnadu","field_file_image_title_text[und][0][value]":"రోబో సీఈవో రెహమాన్"}},"link_text":false,"attributes":{"alt":"robot Zafira tamilnadu","title":"రోబో సీఈవో రెహమాన్","class":"media-element file-default","data-delta":"5"}}]]