Rocket Scientist S Somanath Is New Chairman Of ISRO: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) పదో చైర్మన్‌గా సీనియర్ శాస్త్రవేత్త ఎస్ సోమనాథ్ (Rocket scientist S Somanath) నియమితులయ్యారు. జనవరి 14న కె.శివన్ (K Sivan) పదవీకాలం ముగియనుంది. ఆయన స్థానంలో సోమనాథ్ బాధ్యతలు చేపడతారు. ప్రస్తుతం ఆయన తిరువనంతపురంలోని విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ (VSSC) డైరెక్టర్‌గా ఉన్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

జూలై 1963లో జన్మించిన సోమనాథ్...కొల్లాంలో మెకానికల్‌ ఇంజనీరింగ్‌ పూర్తిచేశాడు. బెంగుళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (IISc) నుండి ఏరోస్పేస్ ఇంజినీరింగ్‌లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి..గోల్డ్ మెడల్ కూడా అందుకున్నారు. సోమనాథ్ 1985లో ఇస్రో (ISRO)లో చేరారు.  పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (PSLV), జియోసింక్రోనస్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (GSLG) కార్యక్రమాలపై విస్తృతంగా పనిచేశారు. జూన్ 2015లో సోమనాథ్ తిరువనంతపురంలోని ఇస్రో లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్స్ సెంటర్ (LPSC) డైరెక్టర్‌గా నియమితులయ్యారు. 


Also Read: Boxer Lovlina: అసోం డీఎస్పీగా బాక్సర్ లవ్లీనాకు బాధ్యతలు అప్పగింత..


పీఎస్ఎల్వీ ప్రాజెక్ట్ మేనేజర్‌గా సోమనాథ్.. మెకానిజమ్స్, పైరో సిస్టమ్స్, ఇంటిగ్రేషన్, శాటిలైట్ లాంచ్ సర్వీస్ మేనేజ్‌మెంట్ విభాగాలను నిర్వహించాడు. సోమనాథ్ 2003లో జీఎస్‌ఎల్‌వీ ఎంకే-III (GSLV MkIII) ప్రాజెక్ట్‌లో చేరారు. జూన్ 2010 నుండి 2014 వరకు జీఎస్‌ఎల్‌వీ ఎంకే-III ప్రాజెక్ట్ డైరెక్టర్‌గా పనిచేశారు. అంతకముందు వాహనం యొక్క మొత్తం డిజైన్, మిషన్ డిజైన్, స్ట్రక్చరల్ డిజైన్ మరియు ఇంటిగ్రేషన్‌కు డిప్యూటీ ప్రాజెక్ట్ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వహించారు. అతని నాయకత్వంలో కేర్ (CARE) మిషన్ యొక్క మొదటి ప్రయోగాత్మక విమానం డిసెంబర్ 18, 2014న విజయవంతంగా పూర్తి చేయబడింది.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook