రైతు బంధు తరహాలోనే ప్రతీ నిరుపేద రైతుకు రూ.6000 ఆర్థిక సాయం
రైతు బంధు తరహాలోనే ప్రతీ నిరుపేద రైతుకు రూ.6000 ఆర్థిక సాయం
న్యూఢిల్లీ: ఆశించిన విధంగానే లోక్ సభ ఎన్నికలకు ముందుగా ప్రస్తుత ఎన్డీఏ సర్కార్ ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్‌లో కేంద్రం రైతులకు వరాల జల్లు గుప్పించింది. అందులో ఒకటి ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా ఐదు ఎకరాల్లోపు భూమి (2 హెక్టార్లు) ఉండే రైతులు అందరికీ ఏడాదికి రూ. 6000 ఆర్థిక సహాయం అందివ్వనున్నట్లు మధ్యంతర బడ్జెట్ ప్రసంగంలో కేంద్ర తాత్కాలిక ఆర్థిక శాఖ మంత్రి పీయుష్ గోయల్ స్పష్టంచేశారు. మూడు వాయిదాల్లో నేరుగా రైతుల బ్యాంక్ ఖాతాల్లోకే సొమ్మును బదిలీ చేయనున్నట్లు పీయూష్ గోయల్ పేర్కొన్నారు.
[[{"fid":"177029","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]
కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం కారణంగా 12 కోట్ల మంది రైతులకు ప్రయోజనం చేకూరనుండగా ప్రభుత్వ ఖజానాపై రూ. 75వేల కోట్ల అదనపు భారం పడనుందని పీయుష్ గోయల్ సభకు తెలిపారు. ఇటీవల తెలంగాణ సర్కార్ తీసుకొచ్చిన రైతు బంధు పథకం ఆ ప్రభుత్వానికి ఎన్నిక్లలో తిరిగి భారీ మెజార్టీని కట్టబెట్టిన సంగతి తెలిసిందే. దీంతో కేంద్ర బడ్జెట్‌లోనూ ఇటువంటి పథకాలు ఉండే అవకాశాలు మెండుగా ఉన్నాయని మొదటి నుంచి ఆర్థిక నిపుణులు, పరిశీలకులు చెబుతూ వస్తున్నారు. వారు చెప్పినట్టుగానే తాజాగా కేంద్రం ప్రతీ నిరుపేద రైతుకు ఏటా రూ.6000 ఆర్థిక సహాయం ప్రకటించడం గమనార్హం.