Telugu States RS Seats: సార్వత్రిక ఎన్నికలకు దేశంలో మరో ఎన్నికకు షెడ్యూల్‌ విడుదలైంది. దేశంలోని 15 రాష్ట్రాలకు చెందిన 56 మంది సభ్యుల ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటన విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఫిబ్రవరి 8న రాజ్యసభ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలవుతుందని ప్రకటించింది. ఫిబ్రవరి 27న పోలింగ్ నిర్వహిస్తామని ఎన్నికల సంఘం వెల్లడించింది. కాగా ఈ ఎన్నికల్లో తెలుగు రాష్ట్రాల్లో ఖాళీ అవుతున్న ఆరు స్థానాలకు కూడా ఎన్నికలు జరుగనున్నాయి.తెలంగాణలో మూడు, ఆంధ్రప్రదేశ్‌లో మూడు స్థానాలు ఖాళీ అవుతున్న విషయం తెలిసిందే.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రాష్ట్రాల్లో ఖాళీలు ఇలా
ఈ ఎన్నికల్లో అత్యధికంగా ఉత్తరప్రదేశ్‌ నుంచి ఖాళీలు ఉన్నాయి. యూపీ నుంచి 10 స్థానాలు, బిహార్‌, మహారాష్ట్రలో 6 చొప్పున, పశ్చిమ బెంగాల్‌, మధ్యప్రదేశ్‌లో 5 చొప్పున, గుజరాత్‌, కర్ణాటకలో 4 చొప్పున, ఒడిశా, రాజస్థాన్‌తోపాటు తెలుగు రాష్ట్రాల్లో మూడు చొప్పున, హర్యానా, చత్తీస్‌గడ్‌, హిమాచల్‌ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌లో ఒక్కొక్క రాజ్యసభ స్థానం ఖాళీ అవుతున్నాయి. కాగా ఈ స్థానాలన్నింటిలో అత్యధికంగా బీజేపీ ఖాతాలో చేరుతాయని తెలుస్తోంది.


తెలుగు రాష్ట్రాల నుంచి
తెలంగాణ రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ పార్టీ నుంచి వద్దిరాజు రవిచంద్ర, బడుగుల లింగయ్య యాదవ్, బోయనపల్లి సంతోశ్‌ కుమార్ రాజ్యసభ్యులుగా ఉన్న విషయం తెలిసిందే. వారి ఆరేళ్ల పదవీకాలం త్వరలో ముగియనుంది. ఇక ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌ రెడ్డి, తెలుగుదేశం నుంచి ఎన్నికైన సీఎం రమేష్ (ప్రస్తుతం బీజేపీ), కనకమేడల రవీంద్ర కుమార్  పదవీకాలం కూడా ముగుస్తోంది. వీరందరి పదవీకాలం ఏప్రిల్‌ 4వ తేదీతో ముగియనుంది.


ఎవరి ఖాతాలో సీట్లు
ఈ స్థానాలకు ఎమ్మెల్యే కోటాలో జరిగే ఎన్నికలు కావడంతో తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తెలంగాణలో అధికారం కోల్పోవడంతో బీఆర్‌ఎస్‌ పార్టీకి ఆ మూడు స్థానాలు దక్కే అవకాశం లేదు. సీట్ల శాతం పరిశీలిస్తే బీఆర్‌ఎస్‌కు ఒక స్థానం దక్కేలా ఉంది. మిగతా రెండు స్థానాలు కాంగ్రెస్‌ ఖాతాలో జమయ్యేలా ఉంది. ఇక ఏపీలో మూడింటికి మూడు స్థానాలు వైఎస్సార్‌సీపీ ఖాతాలో పడేలా ఉన్నాయి. రాజ్యసభ ఎన్నికల కోసమే ఏపీ ప్రభుత్వం ఆగమేఘాల మీద పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల రాజీనామాను ఆమోదించాలని చూస్తోంది. ఇటీవల గంటా శ్రీనివాసరావు రాజీనామా ఆమోదం అందులో భాగమే.

షెడ్యూల్‌ ఇలా
ఎన్నికల ప్రకటన: ఫిబ్రవరి 8
పోలింగ్‌: ఫిబ్రవరి 27
ఖాళీ అయ్యే స్థానాలు: 56

Also Read: Sharmila Meets Sunitha: షర్మిల మరో సంచలనం.. వివేకా కూతురు సునీతతో భేటీ

Also Read: India Vs Eng: ఉప్పల్‌లో భారత జట్టుకు తీవ్ర నిరాశ.. టామ్ హార్ట్‌లేకు హార్ట్‌ లేదబ్బా



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


 Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి