Sabarimala Online Booking: మండల పూజల కోసం శబరిమల అయ్యప్ప స్వామి ఆలయం సిద్ధమవుతోంది. కరోనా లాక్‌డౌన్‌ తరువాత నిర్వహించనున్న తొల మండల పూజ కోసం బుధవారం ఆలయాన్ని అధికారులు తెరిచారు. ఆలయ ప్రధాన అర్చకుడు ఎన్.పరమేశ్వరన్ నంబూదిరి ఆధ్వర్యంలో బుధవారం సాయంత్రం 5 గంటలకు ఆలయాన్ని తెరిచారు. బుధవారం దాదాపు 28 వేల మంది భక్తులు దర్శనానికి స్లాట్ బుక్ చేసుకున్నారు. గురువారం 50 వేల మంది భక్తులకు చేరుకునే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

41 రోజుల పాటు మండల పూజలు జరగనున్నాయి. డిసెంబర్ 27వ తేదీన పూజలు ముగియనున్నాయి. భక్తులు భారీ సంఖ్యలో స్వామి వారి దర్శనానికి వచ్చే అవకాశం ఉండడంతో అధికారులు పూర్తి ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు వైద్యశాఖ అధికారులు ముందు జాగ్రత్త చర్యలు చేపడుతున్నారు. తనంతిట్ట జనరల్ 
హస్పిటల్లో ప్రత్యేక శబరిమల వార్డును సిద్ధం చేస్తున్నట్లు కేరళ వైద్యశాఖ మంత్రి వీణా జార్జ్ తెలిపారు. మందులు, ల్యాబ్ పరీక్షలు ఫ్రీగా చేస్తామన్నారు. ఆధునాతన వసతులతో వార్డు ఏర్పాటు చేస్తామన్నారు. 


భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా కేరళ పోలీసులు పటిష్ట చర్యలు చేపడుతున్నారు. ముఖ్యంగా రద్దీ పెరిగే కొద్ది తోపులాటలు సహా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరకుండా పక్కా ప్లాన్‌తో జాగ్రత్తలు తీసుకోవాలని నిర్ణయించారు. దాదాపు 13 వేల మంది పోలీసులను భద్రతకు నియమించినట్లు ఉన్నతాధికారులు తెలిపారు. ఎన్​డీఆర్ఎఫ్, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ వంటి దళాలను కూడా అందుబాటులో ఉంచామని.. తాత్కాలిక పోలీస్‌ స్టేషన్లు కూడా ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. 


Also Read: Post Office Scheme: ఈ స్కీమ్‌లో పెట్టుబడి పెట్టండి.. భారీ లాభం పొందండి  


Also Read: Bandi Sanjay: కేసీఆర్‌నే ఎవడూ దేఖడం లేదు.. ఆమెను ఎవరు పట్టించుకుంటారు.. బండి సంజయ్ కౌంటర్  


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి