బీజేపీలో చేేరే విషయమై రాజస్థాన్ కాంగ్రెస్ తిరుగుబాటు నేత సచిన్ పైలట్ మరోసారి స్పష్టత ఇచ్చారు. తాను బీజేపీలో చేరడం లేదని స్పష్టంగా చెప్పారు. ఆ పార్టీపై పోరాడి గెలిచినప్పుడు అదే పార్టీలో ఎలా చేరతామని పైలట్ ప్రశ్నించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


రాజస్థాన్ మాజీ డిప్యూటీ సీఎం సచిన్ పైలట్ పై కాంగ్రెస్ అధిష్టానం చర్యలు కొనసాగుతున్నా సరే తాను పార్టీని వీడటం లేదంటున్నారు. రెండుసార్లు సీఎల్పీ సమావేశానికి  రాకపోవడం, తిరుగుబాటు బావుటా ఎగరేసిన నేపధ్యంలో పార్టీ అధిష్టానం సచిన్ పైలట్ ను డిప్యూటీ సీఎం పదవి, పీసీసీ అధ్యక్ష పదవి నుంచి తప్పించింది. ఇవాళ పార్టీ వ్యతిరేక కార్యకలాపాల ఆరోపణలపై అనర్హత వేటుకు నోటీసులు జారీ చేసింది.సచిన్ తో పాటు మొత్తం 19 మంది రెబెల్ ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చారు స్పీకర్. ఈ తాజా పరిణామాల నేపధ్యంలో సచిన్ పైలట్ బీజేపీలో చేరడం ఖాయమనే వార్తలు వచ్చాయి. అయితే తాను బీజేపీలో చేరడం లేదంటూ మరోసారి స్పష్టం చేశారు. Also read: Rajastan crisis: పైలట్ చేతుల్లో ఏం లేదు.. డ్రామా అంతా బీజేపిదే: అశోక్ గెహ్లట్


సీఎం అశోక్ గెహ్లాట్ పై కాలుదువ్వినప్పుడే బీజేపీలో చేరుతున్నారంటూ ప్రచారం సాగింది. అప్పుడే సచిన్ పైలట్ ఖండించారు. ఇప్పుడు తాజాగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం చర్యలకు పాల్పడటంతో మరోసారి బీజేపీ విషయం ప్రస్తావనకొచ్చింది. దాంతో బీజేపీలో చేరే ప్రసక్తే లేదని ఇంకోసారి తేల్చి చెప్పారు సచిన్ పైలట్. గత ఎన్నికల్లో అదే పార్టీపై పోరాడి గెలిచినప్పుడు ఆ పార్టీలో ఎలా చేరతామని ప్రశ్నించారు. ఇదంతా తప్పుడు ప్రచారమని కొట్టిపారేశారు. Also read: Sachin Pilot: ఎవరీ సచిన్ పైలట్? ఎందుకీ వివాదం?