బ్యాడ్మింటన్ రాకెట్ పట్టి .. క్రీడారంగంలో రాణించిన ప్రఖ్యాత షట్లర్ సైనా నెహ్వాల్... ఇప్పుడు రాజకీయ రంగంలోనూ అడుగులు వేసేందుకు సిద్ధమయ్యారు.  పెళ్లి తర్వాత కొత్త ఇన్నింగ్స్ ప్రారంభించారు. షట్లర్ గా సుపరిచితమైన సైనా నెహ్వాల్.. ఇప్పుడు కొత్త అవతారంలో కనిపించనున్నారు. తాజాగా ఆమె భారతీయ జనతా  పార్టీ చేరారు. ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో ఆమె బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్నారు. అధికారికంగా కమలం పార్టీ సభ్యత్వం తీసుకున్నారు.  దేశానికి సేవ చేసేందుకే బీజేపీలో చేరినట్లు  సైనా నెహ్వాల్ తెలిపారు. సైనాతోపాటు ఆమె సోదరి చంద్రాన్షు కూడా బీజేపీలో సభ్యత్వం తీసుకోవడం విశేషం.  
[[{"fid":"181519","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":"బీజీపీ కండువా కప్పుకున్న అక్కా చెల్లెళ్లు"},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":"బీజీపీ కండువా కప్పుకున్న అక్కా చెల్లెళ్లు"}},"link_text":false,"attributes":{"title":"బీజీపీ కండువా కప్పుకున్న అక్కా చెల్లెళ్లు","class":"media-element file-default","data-delta":"1"}}]]


క్రీడారంగానికి బీజేపీ నేతృత్వంలోని NDA ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోందని రాకెట్ షట్లర్ సైనా నెహ్వాల్ అన్నారు. దేశంలో అనేక పథకాలను ప్రధాని మోదీ నేతృత్వంలో ముందుకు తీసుకు వెళ్తోందని కొనియాడారు. ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ సిద్ధాంతాలు నచ్చడంతో .. తాను బీజేపీలో చేరుతున్నట్లు ఆమె చెప్పుకున్నారు. ఖేలో ఇండియా లాంటి కార్యక్రమాలు ఆటగాళ్లకు మరింత ప్రోత్సహాన్ని ఇచ్చాయని తెలిపారు. దేశంలో క్రీడా రంగాన్ని ప్రోత్సహిస్తున్న బీజేపీకి తన వంతు మద్దతు తెలిపేందుకు పార్టీలో చేరానని చెప్పారు.