40 passengers injured as 2 buses collide near Salem: తమిళనాడులోని సేలం జిల్లాలో మంగళవారం సాయంత్రం బస్సు ఆక్సిడెంట్ జరిగింది. ఎదురెదురుగా వస్తున్న రెండు బస్సులు ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో 40 మందికి గాయాలు అయ్యాయి. ఓ బస్సు డ్రైవర్ తన సీటులోంచి ఎగిరిపడ్డాడు. గాయాలు అయిన వారిని సేలంలోని ఎడప్పాడి ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో చేర్పించారు. అందరికి చికిత్స చేశారు. అయితే గాయపడిన వారిలో ముగ్గురు ప్రయాణికుల పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... మంగళవారం సాయంత్రం 30 మంది ప్రయాణికులతో ఎడప్పాడి నుంచి శంకరి వైపు ఓ ప్రైవేట్ బస్సు వెళ్తోంది. మరోవైపు తిరుచెంగోడ్‌లోని ప్రైవేట్‌ కళాశాల కేఎస్‌ఆర్‌ విద్యాసంస్థకు చెందిన బస్సు 55 మంది విద్యార్థులతో శంకరి మీదుగా ఎడప్పాడి వెళ్తోంది. అయితే ఎడప్పాడి-శంకరి హైవేలోని కోజిపన్నై బస్‌స్టాప్‌కు చేరుకోగానే.. ఎదురెదురుగా వస్తున్న ఈ రెండు  బస్సులు ఒకదానికొకటి ఢీకొన్నాయి. 


వర్షం పడుతుండడంతో ప్రైవేట్ బస్సు డ్రైవర్ వైపర్ వేసుకుని సరైన మార్గంలోనే వెళుతున్నాడు. అయితే ఎదురుగా వస్తున్న కళాశాల బస్సు తన ముందున్న వాహనాన్ని ఓవర్ టేక్ చేసే క్రమంలో ప్రైవేట్ బస్సును ఢీ కొట్టింది. రెండు బస్సులు కూడా వేగంగా వెళుతుండంతో ప్రయాణికులు, విద్యార్థులు తమ సీటులోంచి కిందపడ్డారు. ప్రైవేట్ బస్సు డ్రైవర్ పి అరుణాచలం (42), సి చిన్నకన్నన్ (60), కళాశాల బస్సు డ్రైవర్ పి కార్తికేయన్ (32) తలలకు గాయాలయ్యాయి. 



ప్రైవేట్ బస్సు డ్రైవర్ అరుణాచలం తలకు తీవ్ర గాయాలు అయ్యాయి. ప్రమాదంలో గాయపడిన 40 మందిని సేలంలోని ఎడప్పాడి ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో చేర్పించారు. గాయపడిన అందరికీ చికిత్స చేశారు. ఇందులో 12 మంది కళాశాల విద్యార్థుల కూడా ఉన్నారు. గాయపడిన వారిలో ముగ్గురు ప్రయాణికుల పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 


Also Read: Tattoo on Face: మద్యం మత్తులో ఈ వ్యక్తి ఏం చేశాడో చూడండి- వైరల్ వీడియో!


Also Read:  ady rams into Balakrhna house : బాలకృష్ణ ఇంటి గేటును ఢీకొట్టిన యువతి


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.