Salman father salim khan on black buck poaching case: సల్మాన్ ఖాన్ కు బిష్ణోయ్ గ్యాంగ్ కంటి మీద కునుకులేకుండా చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే సల్మాన్ ను పలు మార్లు హత్య చేసేందుకు బిష్ణోయ్ గ్యాంగ్ కుట్రలు చేశారు. ఇటీవల బాబా సిద్దీఖీ హత్య తర్వాత ఇటు బాలీవుడ్ తో పాటు, రాజకీయాల్లో కూడా బిష్ణోయ్ గ్యాంగ్ అంటేనే చాలు భయపడిపోతున్నారు. మరోవైపు ఇటీవల ఈ గ్యాంగ్ ఏకంగా ముంబై ట్రాఫిక్ పోలీసులకు వాట్సాప్ మెస్సెజ్ చేశారు. సల్మాన్ ఐదు కోట్లిస్తే వదిలేస్తామన్నారు. అంతే కాకుండా బిష్ణోయ్ సమాజానికి తప్పుచేసినట్లు ఓప్పుకొవాలని చెప్పి సారీ చెప్పాలన్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 



అయితే.. తమ వార్నింగ్ ను లైట్ తీసుకుంటే మాత్రం.. బాబా సిద్దీఖీ మరణం కన్నా కూడా.. ఘోరంగా సల్మాన్ చావు ఉంటుందని కూడా స్పష్టం చేశారు. ఈ క్రమంలో సల్లుభాయ్ ఇంటి చుట్టు పోలీసులు బందో బస్తు పెంచారు. అంతే కాకుండా.. ఆయన మరో 60 మంది భద్రత సిబ్బందిని ప్రత్యేకంగా నియమించుకున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సల్మాన్ ఖాన్ తండ్రి సలీం ఖాన్ తన బిష్ణోయ్ గ్యాంగ్ బెదిరింపులపై స్పందించారు. 


పూర్తి వివరాలు..


సల్మాన్ ఖాన్ హామ్ సాత్ సాత్ హై మూవీ షూటింగ్ కోసం 1998 లో రాజస్థాన్ కు వెళ్లారు .అక్కడ బిష్ణోయ్ తెగ పవిత్రంగా భావించే మచ్చల జింకల్ని వేటాడి చంపారని అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే.. ఈ జింకల్ని బిష్ణోయ్ తెగ ఎంతో పవిత్రంగాను, తమ ఆరాధిస్తుంటారు. అప్పటి నుంచి ఈతెగ సల్మాన్ పై పగ పెంచుకున్నట్లు తెలుస్తుంది. రాజస్థాన్ కోర్టు కూడా.. సల్మాన్ ఖాన్ ఘటనలో సరైన ఆధారాల్లేవని చెప్పడం కూడా అప్పట్లో సంచలనంగా మారింది. దీంతో ఈ ఘటనపై బిష్ణోయ్ తెగ తామే.. రీవెంజ్ తీర్చుకుంటామని కూడా ప్రకటించారు.


Read more: Salman khan: సల్మాన్ ప్రాణాలు కాపాడుతున్న శక్తివంతమైన బ్రాస్ లేట్..?.. దాని స్పెషాలిటీ, ఆయనకు ఎవరిచ్చారో తెలుసా..?


పలు మార్లు సల్లు భాయ్ హత్యకు ప్లాన్ లు సైతం చేశారు. తాజాగా, సల్లుభాయ్ తండ్రి మీడియా సమావేశంలో మాట్లాడారు. సలీంఖాన్  మాట్లాడుతు..తన కొడుకు మచ్చల జింకను చంపాడని చెప్పడం అవాస్తవమన్నారు. తన కొడుకుకు జంతువులంటే ఎంతో ప్రేమని, తన ఇంట్లో పెంపుడు శునకం చనిపోతేనే రోజుల తరబడి ఫుడ్ తీసుకొమని అలాంటిది జింకల్ని చంపాడనటం బాధకరమన్నారు. సల్మాన్ కు బొద్దింకల్ని చంపడం కూడా తెలీదన్నారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.