Salman khan: సల్మాన్ ప్రాణాలు కాపాడుతున్న శక్తివంతమైన బ్రాస్ లేట్..?.. దాని స్పెషాలిటీ, ఆయనకు ఎవరిచ్చారో తెలుసా..?

Salman VS Lawrence Bishnoi: కండల వీరుడు సల్మాన్ కు కొన్ని ఏళ్లుగా లారెన్స్ బిష్ణోయ్ కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పలు మార్లు  హత్యకు కుట్రలు సైతం ప్లాన్ లు చేశారు.

1 /7

బాలీవుడ్ నటుడు సల్మాన్ కు బిష్ణోయ్ గ్యాంగ్ చుక్కలు చూపిస్తున్నారు. తాజాగా, ఆయనకు మరోమారు మాస్ వార్నింగ్ ఇచ్చారు. తమకు రూ. 5 కోట్లు ఇస్తే వదిలేస్తామని చెప్పారు. ఏకంగా పోలీసులకే వాట్సాప్ సందేశం పంపారు.

2 /7

కొన్నిరోజులు క్రితం సల్మాన్ కు మంచి స్నేహితుడు, బాబా సిద్దీఖీని బిష్ణోయ్ గ్యాంగ్ అత్యంత క్రూరంగా హతమార్చారు. అంతే కాకుండా.. ఆ తర్వాత సల్మాన్ ను కూడా చంపేస్తామంటూ వార్నింగ్ ఇచ్చారు.  దీంతో పోలీసులు సల్మాన్ ఇంటి దగ్గర గట్టి బందో బస్తు సైతం ఏర్పాటు చేశారు.  

3 /7

ఇదిలా ఉండగా సల్మాన్ ఖాన్ పలు మార్లు బిష్ణోయ్ గ్యాంగ్ కుట్రల నుంచి వెంట్రుక వాసిలో తప్పించుకున్నారు. అయితే.. దీని వెనుకాల ఆయన ప్రాణాలు కాపాడుతోంది మాత్రం నీలం రంగు బ్రాస్ లేట్ అని తెలుస్తోంది.

4 /7

గతంలో సల్మాన్ ఖాన్ స్వయంగా తన తండ్రి నుంచి తనకు నీలం రంగు బ్రాసెలేట్ వచ్చిందని, అదిఎంతో మహిమగలదని కూడా చెప్పారు.  ముఖ్యంగా ఆ బ్రాస్ లేట్ అనేది నెగెటివ్ ఎనర్జీని దూరం చేస్తుందన్నాడు. 

5 /7

 సల్మాన్ ఖాన్ చేతికి ఎల్లప్పుడు బ్రాస్లెట్ ఉంటుంది. ఆయన తండ్రి కూడా ఇదే విధంగా బ్రాస్ లేట్ ధరించే వాడని ఇది ఎంతొ శక్తివంతమైందని కూడా చెప్పుకొచ్చాడు.  ముఖ్యంగా ఈ బ్రాస్ లేట్ కు.. ఒక స్టోన్ ఉంటుంది.  ఈ రత్నాన్ని ఫిరూజా అని పిలుస్తారంట

6 /7

ఈ బ్రాస్ లేట్ ధరించడం అదృష్టమని, కష్టాల తొలగిపోతాయని సల్మాన్ కు వాళ్ల తండ్రి చెప్పాడంట. ఎలాంటి దుష్ట శక్తుల్ని, చెడు ఫలితాల్ని అయిన దూరం చేస్తుందంట. అందుకే సల్లు భాయ్ ఈ బ్రాస్ లేట్ ను ఎప్పుడు వేసుకునే ఉంటాడంట.

7 /7

ఇప్పటి వరకు ఈ బ్రాస్ లేట్ వల్ల తాను.. అనేక నెగెటివ్ ప్రభావాలు, పరిస్థితుల నుంచి బైటపడినట్టు  కూడా సల్లు భాయ్ చెప్పుకొచ్చారు. అయితే.. ఇటీవల బాబా సిద్దీఖీ హత్య తర్వాత సల్మాన్ ఖాన్ కొంత ఆందోళనలకు గురయ్యారంట. దీంతో మరోమారు ఈ బ్రాస్ లేట్ కు చెందిన స్టోరీ వార్తలలొ నిలిచింది.