Salman khan receives fresh threat pay rupees 5 crores demanded Bishnoi: బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ కు బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి మళ్లీ బెదిరింపులు వచ్చాయి. ఏకంగా ముంబైలోని ట్రాఫిక్ పోలీసులకు వాట్సాప్ సందేశం వచ్చింది. ఈ ఘటన ఒక్కసారిగా బాలీవుడ్ తో పాటు, రాజకీయంగా కూడా మళ్లీ పెనుదుమారంగా మారింది. సల్మాన్ ను చంపొద్దంటే.. తమకు రూ. 5 కోట్లు ఇవ్వాలని కూడా లారెన్స్ బిష్ణోయ్ ఆ వాట్సాప్ సందేశంలో డిమాండ్ చేసినట్లు తెలుస్తొంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అంతే కాకుండా... తాము డిమాండ్ చేసిన డబ్బులు ఇస్తే.. సల్మాన్ ను ప్రాణాలతో వదిలేస్తామని ఆ మెస్సెజ్ లో ఉన్నట్లు సమాచారం. ఒక వేళ తమ డిమాండ్ ను అంగీకరించకుంటే.. బాబా సిద్దీఖీకి కంటే ఘోరమైన చావు సల్మాన్ కు ఉంటుందని కూడా బిష్ణోయ్ గ్యాంగ్ వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తొంది. దీంతో ముంబై పోలీసులు మళ్లీ అలర్ట్ అయ్యారు.  


ముంబైలోకి బాంద్రాలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేసినట్లు తెలుస్తొంది. తమ వార్నింగ్ ను మాత్రం లైట్ గా తీసుకొవద్దని కూడా .. బిష్ణోయ్ గ్యాంగ్ తెల్చి చెప్పింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు తెలుస్తొంది. ఆ వాట్సాప్ ఏ నెట్ వర్క్ పరిధిలో ఉంది.. ఆ ఫోన్ ను ట్రాక్ చేసే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది.


ఇదిలా ఉండగా.. గత వారం సల్మాన్ ఖాన్ సన్నిహితుడు ఎన్సీపీ లీడర్ బాబా సిద్దిఖీ ఆయన కుమారుడి కార్యలయంలో ఉండగా.. బిష్ణోయ్ గ్యాంగ్ అత్యంత క్రూరంగా కాల్పులు జరిపి హతమార్చిన సంగతి తెలిసిందే. మరోవైపు పోలీసులు ఇప్పటికే కాల్పులు జరిపిన వారిని అరెస్టు చేసిన విచారణ చేపట్టారు. ఈ వార్నింగ్ మాత్రం ఇప్పుడు మరోసారి వార్తలలో నిలిచింది.
 ఇదిలా ఉండగా.. కృష్ణజింకలను బిష్ణోయ్ తెగ ఎంతో పూజిస్తారు. తమ తల్లిలాగా ఆరాధిస్తారు.


Read more: Salman Khan: ‘సల్మాన్‌కు సహాయం చేస్తే చావే గతి..’.. సంచలనంగా మారిన లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ వార్నింగ్..


అలాంటి కృష్ణజింకలను సల్మాన్ ఖాన్..1998లో 'హమ్ సాథ్ సాథ్ హై' సినిమా షూటింగ్ కోసం జోధ్ పూర్ కు వెళ్లాడు. అక్కడ  కృష్ణజింకలను వేటాడి చంపేశాడు . అప్పటి నుంచి బిష్ణోయ్ వర్సెస్ సల్మాన్ ల మధ్య వార్ మొదలైంది.  ఇప్పటికే పలుమార్లు సల్మాన్ ను చంపేందుకు బిష్ణోయ్ గ్యాంగ్ కుట్రపన్నినట్లు తెలుస్తొంది. 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.