baba Siddique murder case Bishnoi gans warning to salman khan: ఎన్సీపీ నేత, మహారాష్ట్ర మాజీ మంత్రి బాబా సిద్దిఖీతన కుమారుడి కార్యాలయంలో ఉండగా.. కొంత మంది దుండగులు ఆయనపై కాల్పులు జరిపారు.ఈ ఘటనలో మహారాష్ట్ర సర్కారు ఒక్కసారిగా ఉలిక్కిపడింది. అంతే కాకుండా.. ఈ ఘటనకు పాల్పడింది తామేనంటూ బిష్ణోయ్ గ్యాంగ్ సైతం ప్రకటించింది. ఈ ఘటన ప్రస్తుతం మహారాష్ట్రలో పొలిటికల్ గా హాట్ గా టాపిక్ గా మారింది. ఈ క్రమంలో.. దీనిపై సీఎం ఏక్ నాథ్ షిండే ఫాస్ట్ ట్రాక్ విచారణకు ఆదేశించారు. అదే విధంగా రాజకీయ నేతలతో పాటు, బాలీవుడ్ కూడా ఈ ఘటనపై మాత్రం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉండగా.. ఈ ఘటనపై కండల వీరుడు సల్మాన్ ఖాన్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.. బాబా సిద్దీఖీ లేరని వార్త తెలవగానే.. ఆయన షూటింగ్స్ అన్ని క్యాన్షిల్ చేసుకుని మరీ ఆయన చివరి చూపుకు వచ్చారంట. అంతేకాకుండా.. బాలీవుడ్ మాత్రమేకాకుండా.. అనేక మంది రాజకీయ నాయకులు సైతం ఆయన పార్థీవ దేహానికి నివాళులు అర్పించారు. కాంగ్రెస్ లో చేరిన కొన్నినెలలకే సిద్దీఖీ హత్యకు గురికావడం ప్రస్తుతం రాజకీయంగా రచ్చగా మారింది.
అయితే.. ఈ ఘటనకు పాల్పడిన కొంత మంది నిందితుల్ని పోలీసులు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.. అయితే.. సల్మాన్ ఖాన్ కు. షారుఖ్ ఖాన్ లకు మధ్యఉన్న గొడవల్ని బాబా సిద్ధీఖీ మాట్లాడి స్వాల్వ్ చేశారంట. ఇది ఏమాత్రం కూడా మింగుడు పడని ఒక అంశంగా తెలుస్తోంది. మరోవైపు సల్మాన్ ఖాన్.. 1998 లో క్రిష్ణ జింకల్ని కాల్పులు జరిపి చంపారు. వీటిని బిష్ణోయ్ తెగ వాళ్లు తమ ఆరాధ్య దైవంగా భావిస్తారు.
అప్పటి నుంచి సల్మాన్ ను ఎలాగైన చంపాలని ఈ బిష్ణోయ్ గ్యాంగ్ అనేక మార్లు ప్రయత్నాలు జరుపుతునే ఉన్నారు. కొన్నిరోజుల క్రితం కూడా..ఆయన హత్యకు ప్లాన్ వేసినట్లు తెలుస్తోంది. ఈ ఘటనతనో మాత్రం మరోసారి పోలీసులకు బిష్ణోయ్ తెగ వాళ్లు సవాల్ విసిరినట్లు తెలుస్తోంది. అయితే.. పోలీసులు మాత్రం.. సల్మాన్ ఖాన్ కు పటిష్టమైన బందో బస్తును ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.