Samajwadi MP shocking comments over raising marriage age of women: కేంద్రం ఇటీవల తీసుకున్న మహిళల వివాహ వయసు పెంపు నిర్ణయాన్ని మెజారిటీ ప్రజలు స్వాగతిస్తుండగా... అక్కడక్కడా వ్యతిరేక స్వరాలు కూడా వినిపిస్తున్నాయి. తాజాగా సమాజ్‌వాదీ పార్టీకి (Samajwadi Party) చెందిన ఇద్దరు నేతలు కేంద్ర నిర్ణయాన్ని వ్యతిరేకించారు. ఒకరు మహిళల వివాహ వయసును ఫర్టిలిటీతో ముడిపెట్టగా.. మరొకరు పేదరికంతో ముడిపెట్టారు. ఈ ఇద్దరి కామెంట్స్‌పై స్పందించేందుకు ఎస్పీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ (Akhilesh Yadav) నిరాకరించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఎస్పీ ఎంపీ సయ్యద్ తుఫైల్ హసన్ మాట్లాడుతూ... 'ఆడపిల్లలు 16-17 ఏళ్ల నుంచి 30 ఏళ్ల వరకు సంతానోత్పత్తి (Fertility) సామర్థ్యాన్ని కలిగి ఉంటారు.16 ఏళ్ల నుంచే వారికి పెళ్లి సంబంధాలు వస్తుంటాయి. ఒకవేళ పెళ్లి ఎక్కువ రోజులు వాయిదా వేస్తే రెండు ప్రతికూలతలు ఏర్పడుతాయి. ఒకటి... సంతానోత్పత్తి కలగకపోవచ్చు. రెండు... తల్లిదండ్రులు వృద్దాప్య దశలోకి వెళ్లినా పిల్లలు ఇంకా విద్యార్థులుగానే ఉంటారు. తల్లిదండ్రులు వయసులో ఉన్నప్పుడు పిల్లలు సెటిల్ అయ్యే అవకాశం ఉండదు. కాబట్టి ఆడపిల్ల రజస్వల (Women Mature Age) అయి సంతానోత్పత్తి వయసు రాగానే పెళ్లి చేసేయాలి. 16 ఏళ్లకే రజస్వల అయితే అదే వయసులో పెళ్లి చేసుకోవచ్చు. 18 ఏళ్లకే ఓటు హక్కు ఇస్తున్నప్పుడు... పెళ్లి మాత్రం ఆ వయసులో ఎందుకు చేసుకోకూడదు...?' అని పేర్కొన్నారు.


ఎస్పీకి చెందిన మరో ఎంపీ షఫీకర్ రెహమాన్ మాట్లాడుతూ... 'భారత్ (India) ఒక పేద దేశం. కాబట్టి ప్రతీ తల్లిదండ్రులు తమ బిడ్డలకు త్వరగా పెళ్లి చేయాలనుకుంటారు. కాబట్టి కేంద్రం తీసుకురాబోయే వివాహ వయసు పెంపు బిల్లును నేను సమర్థించను.' అని పేర్కొన్నారు. ఈ ఇద్దరు ఎంపీల కామెంట్లపై స్పందించేందుకు అఖిలేశ్ యాదవ్ నిరాకరించారు. మహిళలు, ఆడపిల్లల అభివృద్ది కోసం ఎస్పీ ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అమలుచేసిందన్నారు.


కాగా, కేంద్ర ప్రభుత్వం ఆడపిల్లల వివాహ వయసును 18 ఏళ్ల నుంచి 21 ఏళ్లకు పెంచుతూ (Minimum Age of Women for Marriage) నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దీనికి కేంద్ర కేబినెట్  ఆమోదం తెలిపింది. ప్రస్తుత పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లోనే ఈ బిల్లును ప్రవేశపెట్టనున్నారు.


Also Read: Omicron Case: భారత్‌లో ఒమిక్రాన్‌ విజృంభన, 109 కి చేరిన కేసులు..జాగ్రత్త అంటోన్న కేంద్రం


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook