Jayabachan: బీజేపీ ఎంపీ రవికిషన్ పై మండిపాటు
ఇద్దరూ ఎంపీలే. ఇద్దరూ సినీ నేపధ్యం నుంచి వచ్చినవారే. అయినా డ్రగ్స్ విషయంలో ఇండస్ట్రీపై అభిప్రాయాలు వేర్వేరు. బీజేపీ ఎంపీ రవి కిషన్ వ్యాఖ్యలపై సమాజ్ వాద్ పార్టీ ఎంపీ జయా బచ్చన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇద్దరూ ఎంపీలే. ఇద్దరూ సినీ నేపధ్యం నుంచి వచ్చినవారే. అయినా డ్రగ్స్ విషయంలో ఇండస్ట్రీపై అభిప్రాయాలు వేర్వేరు. బీజేపీ ఎంపీ రవి కిషన్ ( Bjp Mp Ravi kishan ) వ్యాఖ్యలపై సమాజ్ వాద్ పార్టీ ఎంపీ జయా బచ్చన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
బాలీవుడ్ ఇండస్ట్రీ ( Bollywood Industry ) లో డ్రగ్స్ ( Drugs ) వినియోగం విపరీతంగా ఉందంటూ భోజ్ పురి నటుడు, తెలుగు సినిమా విలన్ , బీజేపీ ఎంపీ రవి కిషన్ పార్లమెంట్ సాక్షిగా వ్యాఖ్యానించడం సంచలనం కల్గిస్తోంది. రవి కిషన్ చేసిన ఈ వ్యాఖ్యలపై ఇదే సినీ నేపధ్యం కలిగిన సమాజ్ వాద్ పార్టీ ఎంపీ జయా బచ్చన్ ( Rajyasabha mp jayabachan ) ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇండస్ట్రీలో కొందరి కోసం అందర్నీ విమర్శించడం తగదని సూచించారు. లోక్ సబలో పరిశ్రమకు చెందిన వ్యక్తే ఈ ఆరోపణలు చేయడంతో సిగ్గు పడాల్సి వచ్చింది. ఆయన వ్యాఖ్యలు చూస్తే..అన్నం పెట్టిన చేతినే నరుకున్నట్టుగా ఉంది అంటూ తీవ్రంగా మండిపడ్డారు.
బాలీవుడ్ పరిశ్రమలో డ్రగ్స్ వినియోగం, అక్రమ రవాణా పెరిగిపోయిందంటూ ఎంపీ రవి కిషన్ మండిపడ్డారు. దేశ యువతను నాశనం చేయటానికి కుట్ర జరుగుతోందని విమర్శించారు. దీనికి పొరుగుదేశాలు సహకారం అందిస్తున్నాయన్నారు. పార్లమెంట్ సాక్షిగా ఈ వ్యాఖ్యలు చేశారు. Also read: శశికళ విడుదలెప్పుడో తెలుసా..స్పష్టం చేసిన బెంగుళూరు సెంట్రల్ జైలు