Uttar Pradesh: యోగి ఇలాఖాలో హైటెన్షన్.. పోలీసులపై రాళ్లదాడి.. టియర్ గ్యాస్ ప్రయోగం.. వీడియోలు వైరల్..
Sambhal Mosque Chaos: ఉత్తర ప్రదేశ్ లో ఆదివారం ఒక్కసారిగా హైటెన్షన్ వాతావరణం నెలకొంది. మసీదు సర్వే చేపట్టడానికి వచ్చిన వారిపై పోలీసులు రాళ్లతో దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనకు చెందిన వీడియోలు ప్రస్తుతం వైరల్ గా మారాయి.
Uttar Pradesh sambhal moque survey controversy: ఉత్తర ప్రదేశ్ లోని సంభాల్ లొ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడినట్లు తెలుస్తొంది. గతంలో ఇక్కడ ఆలయంను పడగొట్టి మసీదు నిర్మాణం చేపట్టారని.. కోర్టులో పిటిషన్ దాఖలైంది. దీంతో కోర్టు వారి ఆదేశాల మేరకు.. సర్వే కోసం షాహి జామా మసీదుకు కొంత మంది అధికారులు వచ్చారు . దీంతో స్థానికులు పెద్ద ఎత్తున గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. పోలీసులు.. అధికారులపై రాళ్లతో దాడులకు పాల్పడ్డారు. ఈ క్రమంలో ఒక్కసారిగా ఆందోళన కర పరిస్థితులు ఏర్పాడ్డాయి.
నిరసన కారులు.. రాళ్లు, ప్లాస్టిక్ బాటిళ్లకు నిప్పులు పెట్టి పోలీసులపై విసిరినట్లు తెలుస్తొంది. దీంతో పోలీసులు సైతం తమ లాఠీలకు పనిచెప్పి.. వారిపై టియర్ గ్యాస్ లు ప్రయోగించినట్లు సమాచారం. దీంతో ఆ ప్రాంతంలో పెద్ద ఎత్తున పోలీసుల్ని మోహరించారు. గుంపులుగా ఏర్పడి పోలీసులు మీదకు రాళ్ల దాడులు చేయడం కలకలంగా మారింది.
మరోవైపు.. హింస జరిగినప్పటికీ, అడ్వకేట్ లు, అధికారులు పటిష్టమైన బందో బస్తు మధ్య కమీషన్ సర్వేను పూర్తి చేసినట్లు తెలుస్తొంది. మొత్తం ప్రక్రియను వీడియోలు, ఫోటోల రూపంలో రికార్డు చేసినట్లు సమాచారం. ఈ మొత్తం రిపోర్టును.. అధికారులు నవంబర్ 29న తమ నివేదికను కోర్టుకు సమర్పించనున్నారు. ఈ క్రమంలో దీనిపై ఉత్తర ప్రదేశ్
డీజీపీ ప్రశాంత్‌కుమార్ మాట్లాడుతూ.. కోర్టు ఆదేశాల మేరకు సంభాల్‌లో సర్వే నిర్వహిస్తున్నారు. కొందరు సంఘ వ్యతిరేకులు రాళ్లు రువ్వినట్లు చెప్పారు. ఘటనా స్థలంలో పోలీసులు, ఉన్నతాధికారులు ఉన్నారని, కొంత మంది పోలీసులు సైతం గాయపడ్డారని చెప్పారు. ప్రస్తుతం అక్కడ.. పరిస్థితి అదుపులో ఉందని, రాళ్లదాడి చేసిన వారిని గుర్తించి తగిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.
ఈ ఘటనపై ఉత్తరప్రదేశ్ డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య స్పందిస్తూ.. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అయితే.. మసీదు స్థానంలో..గతంలో ఆలయం ఉందని పేర్కొంటూ సీనియర్ న్యాయవాది విష్ణు శంకర్ జైన్ కోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్లు తెలుస్తొంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebook, Twitter