Sampriti Yadav gets Dream job in Google after 50 interviews: ప్రతి రోజు లక్షలాది మంది రకరకాల ఉద్యోగాల కోసం ఇంటర్వ్యూలకు వెళుతుంటారు. కొందరు ప్రారంభ ప్రయత్నాలలోనే జాబ్ కొడితే.. చాలామందికి సమయం పడుతుంది. ఇక డ్రీమ్ జాబ్ కోసం అయితే చాలా ఇంటర్వ్యూలకు వెళ్లాల్సి ఉంటుంది. ఒక్కోసారి 20, 30, 40 ఇంటర్వ్యూలు అటెండ్ కావాల్సి ఉంటుంది. ఈ కోవకే చెందిన ఓ 24 అమ్మాయి తన డ్రీమ్ జాబ్ కోసం ఏకంగా 50 ఇంటర్వ్యూలకు వెళ్లి చివరకు సక్సెస్ అయింది. ఆమె ఎవరో కాదు మన భారత దేశ అమ్మాయే. బీహార్‌లోని పాట్నా నగరానికి చెందిన సంప్రీతి యాదవ్.. 2022 ఫిబ్రవరి 14న టెక్‌ దిగ్గజ కంపెనీ గూగుల్‌లో చేరబోతోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

24 ఏళ్ల సంప్రీతి యాదవ్‌ స్వస్థలం బీహార్‌ రాజధాని పాట్నాలోని నెహ్రూ నగర్‌. సంప్రీతి తండ్రి రామ్‌శంకర్‌ యాదవ్‌ బ్యాంక్‌ ఆఫీసర్‌ కాగా.. తల్లి శశి ప్రభ ప్లానింగ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ డిపార్ట్‌మెంట్‌లో అసిస్టెంట్‌ డైరెక్టర్‌. 2014లో నోట్రే డామ్ అకాడమీ నుంచి 10 CGPAతో మెట్రిక్యులేషన్ పూర్తి చేసి.. 2016లో జేఈఈ మెయిన్స్‌ను క్లియర్‌ చేసింది. 2021 మేలో ఢిల్లీ టెక్నాలజికల్‌ యూనివర్సిటీలో బీటెక్‌ కంప్యూటర్‌ సైన్స్‌ పూర్తి చేసింది. బీటెక్‌ పూర్తి చేసిన వెంటనే నాలుగు కంపెనీలు ఆఫర్‌ ఇచ్చాయి. అందులో ఫ్లిప్‌కార్ట్‌, అడోబ్‌ కంపెనీలు కూడా ఉన్నాయి. అయితే  44 లక్షల రూపాయల ప్యాకేజీని ఇచ్చిన మైక్రోసాఫ్ట్‌ను సంప్రీతి ఎంచుకుంది. 


అయితే సంప్రీతి యాదవ్‌ మైక్రోసాఫ్ట్‌లో జాబ్ చేస్తూనే తన డ్రీమ్ కోసం ప్రయత్నాలు చేసింది. ఈ క్రమంలో చాలా ఇంటర్వ్యూలకు అటెండ్ అయింది. చివరకు 9 రౌండ్ల ఇంటర్వ్యూలను క్లియర్ చేసిన తర్వాత గూగుల్ సంప్రీతిని సెలెక్ట్ చేసి రూ. 1.10 కోట్ల వార్షిక ప్యాకేజీని ఆఫర్ చేసింది. ఫిబ్రవరి 14 2022 తేదీన ఆమె గూగుల్‌లో చేరాల్సి ఉంది. ఇందుకోసం సంప్రీతి లండన్ వెళ్లాల్సి ఉంది. ప్రస్తుతం ఆమె ఆ ఏర్పాట్లలో ఉంది. ప్యాకేజీకి సంగతి పక్కన బెడితే గూగుల్ లండన్‌లో ఉద్యోగం రావడం చాలా ముఖ్యమైన అంశం అని, సంతోషంగా ఉందని సంప్రీతి తెలిపింది. 


'ప్రతి సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు ఇది ఓ డ్రీమ్ జాబ్. ఇది నాకు ఇంత త్వరగా రావడం గొప్ప అనుభూతి. అయితే మా బంధువులు, స్నేహితులు విషయం చెప్పే వరకు నాకు జాబ్ వచ్చిందని తెలియదు. ఇది అంత తేలికైన విజయం కాదు. చాలా కష్టపడ్డాను. ఇంటర్వ్యూలలో ఒత్తిడిని అధిగమించడే ముఖ్యం. నా తల్లిదండ్రుల నుంచి ఎంతో ప్రేరణ పొందాను. కలిసే ప్రతి ఒక్కరి నుంచి మనం ఏదైనా నేర్చుకుంటామని నేను నమ్ముతున్నాను. అందరిలానే నేను కూడా ఫేస్‌బుక్ మరియు ఇన్‌స్టాగ్రామ్‌తో సోషల్ మీడియాను ప్రారంభించాను. ఇప్పుడు లింక్డ్‌ఇన్‌లో ఎక్కువ సమయం గడుపుతున్నాను. కనెక్ట్ అయ్యేందుకు సోషల్ మీడియా గొప్ప మార్గం. స్పష్టమైన లక్ష్యాన్ని కలిగి ఉండటం మరియు దశలవారీగా ముందుకు సాగడం చాలా ముఖ్యం' అని సంప్రీతి యాదవ్‌ చెప్పింది. 


Also Read: సిద్ధాంత్‌ చతుర్వేదితో కిస్సింగ్ సీన్స్ కోసం రణవీర్ అనుమతి తీసుకున్నారా?.. దీపికా పదుకొణె ఏం చెప్పారంటే?


Also Read: Khiladi Movie Liplock: హీరోలతో లిప్ లాక్ చేసేందుకు నాకు నో ప్రాబ్లమ్: 'ఖిలాడి' హీరోయిన్


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook