Sankranti 2023 Holidays: ఏపీ, తెలంగాణలో సంక్రాంతి సెలవులు ఇవే.. ఆలస్యం ఎందుకు డేట్స్ చెక్ చేసుకోండి!
Sankranti 2023 holidays for Schools and Colleges in Telangana. తెలంగాణలో పాఠశాలలకు జనవరి 13 నుంచి 17 వరకు సంక్రాంతి 2023 సెలవులు ఉన్నాయి. కాలేజీలకు కూడా ఇవే సెలవులు వర్తించే అవకాశం ఉంది.
Sankranti 2023 holidays for Schools and Colleges in AP and Telangana: తెలుగు రాష్ట్రాల్లో అత్యంత వైభవంగా జరుపుకునే పండుగల్లో 'సంక్రాంతి' ఒకటి. ప్రతిఒక్కరు సంక్రాంతికి సొంతూరు వెళ్లి బాగా ఎంజాయ్ చేస్తారు. ఈ పండుగకు రాష్ట్ర ప్రభుత్వం విద్యాసంస్థలకు సెలవులు ఇస్తుంటుంది. ఆంధ్రప్రదేశ్ అకడమిక్ క్యాలెండర్ (2022-23) ప్రకారం.. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు జనవరి 11 నుంచి 16 వరకు సంక్రాంతి సెలవులు ఉన్నాయి. జనవరి 17న తిరిగి విద్యాసంస్థలు తెరుచుకుంటాయి. అయితే ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
ఏపీ రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ మండలి అకడమిక్ క్యాలెండర్ 2022-23లో 220 రోజులు పాఠశాలలు పని చేస్తాయని, 80 రోజులు సెలవులు ఉంటాయని ముందుగానే తెలిపింది. ఇంటర్ కాలేజీలకు జనవరి 11 నుంచి 17 వరకు సంక్రాంతి సెలవులు ఉండనున్నాయి. మరోవైపు తెలంగాణలో పాఠశాలలకు జనవరి 13 నుంచి 17 వరకు సంక్రాంతి సెలవులు ఉన్నాయి. కాలేజీలకు కూడా ఇవే సెలవులు వర్తించే అవకాశం ఉంది.
మరో 4 రోజుల్లో కొత్త సంవత్సరం ప్రారంభం కానుంది. సాధారణంగా జనవరిలో ఎక్కువ సెలవులు ఉంటాయి. ఎందుకంటే.. కొత్త సంవత్సరం, సంక్రాంతి, రిపబ్లిక్ డే సైతం ఈ నెలలోనే ఉంటాయి. ఇక ఆదివారాలు, రెండో శనివారం కలిపితే బోలెడు సెలవులు ఉంటాయి. అయితే ఈ ఏడాది పరిస్థితి కాస్త భిన్నంగా ఉంది. జనవరి 1న సెలవు దినంగా ప్రభుత్వం పేర్కొంటుంది. ఈసారి జనవరి 1 ఆదివారం రోజు రావడంతో.. విద్యార్థులు, ఉద్యోగులు సెలవు తీసుకునే అవకాశం లేదు. భోగి పండుగ కూడా రెండో శనివారం రాగా.. సంక్రాంతి ఆదివారం వచ్చింది. దాంతో విద్యార్థులు, ఉద్యోగులు మూడు రోజులు సెలవులను కోల్పోయారు.
ఇక తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్ వార్షిక పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. 2023 మార్చి 15 నుంచి ఏప్రిల్ 4 వరకు ఏపీలో ఇంటర్ పరీక్షలు జరగనున్నాయి. మార్చి 15 నుంచి ఏప్రిల్ 3 వరకు ఫస్టియర్ పరీక్షలు జరగనుండగా.. మార్చి 16 నుంచి ఏప్రిల్ 4 వరకు సెకండ్ పరీక్షలు జరగనున్నాయి. 2023 మార్చి 15 నుంచి ఏప్రిల్ 4 వరకు తెలంగాణలో ఇంటర్ పరీక్షలు జరగనున్నాయి. మార్చి 15న ఇంటర్ ఫస్టియర్, మార్చి 16న సెకండియర్ ఎగ్జామ్స్ ప్రారంభం కానున్నాయి.
Also Read: Cheap Tata Nexon Cars: డెడ్ చీప్‌గా టాటా నెక్సాన్ కారు.. కేవలం రూ. 6 లక్షలకే ఇంటికి తీసుకెళ్లండి!
Also Read: TSRTC Ticket Discounts: సంక్రాంతి బంపర్ బొనాంజా.. టీఎస్‌ఆర్‌టీసీ టికెట్లపై సూపర్ డిస్కౌంట్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook.