Tamilnadu: తమిళనాట మళ్లీ రాజకీయాలు వేడెక్కబోతున్నాయి. మాజీ ముఖ్యమంత్రి జయలలిత నెచ్చెలి శశికళ మళ్లీ రాజకీయాల్లోకి రానున్నారనే వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. ముఖ్యంగా ఏఐఏడీఎంకేలో నిరసన గళం విన్పిస్తోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల (Tamilnadu Assembly Elections)అనంతరం ఇప్పుడు మరోసారి రాజకీయాలు హాట్‌హాట్‌గా మారనున్నాయి. ఎన్నికలకు ముందు జైలు నుంచి విడుదలైన జయలలిత నెచ్చెలి శశికళ అప్పుడే రాజకీయాల్లో వస్తారని ఆశించారు. అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు జరిగాయి. విడుదలై బెంగుళూరు నుంచి చెన్నై వస్తున్న సందర్బంగా జరిగిన ర్యాలీ హాట్ టాపిక్‌గా నిలిచింది. ఆమె వస్తుందని తెలియగానే ఏఐఏడీఎంకే వర్గాల్లో కలవరం ప్రారంభమైంది. ఏమైందో గానీ..హఠాత్తుగా రాజకీయాల్నించి నిష్క్రమిస్తున్నట్టు ప్రకటించారు.


ఇప్పుడు మళ్లీ ఆమె రాజకీయాల్లో ప్రవేశిస్తుందనే వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. ముఖ్యంగా ఏఐఏడీఎంకే (AIADMK) వర్గాల్లో కలవరం ప్రారంభమైంది. పార్టీని విఛ్చిన్నం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నాడీఎంకే పార్టీ నేతలు మండిపడుతున్నారు. ఆమె రాజకీయ ప్రవేశంతో పార్టీకి మేలు జరగదని..ఇంకా కీడే ఎక్కువగా జరుగుతుందని పార్టీ నేతలు విమర్శిస్తున్నారు.శశికళ రాజకీయ ప్రవేశం డీఎంకేకు మరింతగా మేలు చేస్తుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. శశికళ తదుపరి చర్యపై నిశితంగా గమనిస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే శశికళ(Sasikala)..తన అనుయాయులతో చేసిన ఫోన్ సంభాషణ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. 


Also read: CBSE Class 12 Board Exams 2021: సీబీఎస్ఈ 12వ తరగతి బోర్డ్ ఎగ్జామ్స్‌ తుది నిర్ణయం ఎప్పుడంటే


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook