చెన్నై: ఎట్టకేలకు శశికళ  బెంగుళూరు జైలు నుంచి విడుదలయ్యారు. కోర్టు ఆదేశాల మేరకు శుక్రవారం  ఆమెను జైలు అధికారులు విడుదల చేశారు.  శశికళ విడుదల నేపథ్యంలో బెంగళూరు, చెన్నైలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆనారోగ్యంతో ఉన్న భర్తను చూసేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ శశికళ బెంగళూరు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తనకు 15 రోజుల పాటు విడుదలకు అనుమతి ఇవ్వాలని పిటిషన్ లో పేర్కొన్నారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు ఆమెను పెరోల్ పై విడుదల చేసేందుకు అనుమతి ఇచ్చింది. అయితే 5 రోజుల పాటే పెరోల్ పై విడుదలకు అంగీకరించింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

షరతులు ఇవే... 
శశికళను ఐదు రోజుల పాటు పెరోల్ పై విడుదల చేసినప్పటికీ కోర్టు అనేక షరతులు విధించింది. రాజకీయ సమావేశాలు పెట్టకూడదు.. వ్యక్తిగత పనుల మీద తప్ప, ఇతరత్రా కారణాలు చూపి ఎక్కడికంటే అక్కడికి వెళతానంటే కుదరదు.. ఇలా సవాలక్ష ఆంక్షల నడుమ, శశికళకు బెయిల్‌ వచ్చింది.


జయలలిత మరణం తర్వాత శశికళకు ముఖ్యమంత్రి పీఠం దక్కలేదు సరికదా, ఆమె జైల్లో మగ్గిపోవాల్సి వచ్చింది. అక్రమాస్తుల కేసులో చనిపోయి జయలలిత తప్పించుకుంటే, ఆమెతోపాటు శిక్ష అనుభవించాల్సిన శశికళ, ఒంటరిగా జైల్లో గడపాల్సి వస్తోంది.