SBI Clerk Posts: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి మరో గుడ్‌న్యూస్. ఎస్బీఐ పెద్దఎత్తున క్లర్క్, పీవో పోస్టులకు భర్తీ చేయనుంది. త్వరలో నోటిఫికేషన్ వెలువడనుంది


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దేశంలో అతిపెద్ద బ్యాంకింగ్ వ్యవస్థ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన అధికారిక వెబ్‌సైట్  sbi.co.inలో ఎస్బీఐ క్లర్క్స్ నియామకం 2022 గురించి త్వరలో నోటిఫికేషన్ వెలువరించనున్నట్టు తెలిపింది. చాలాకాలంగా నిరుద్యోగులు ఎస్బీఐ క్లర్క్, పీవో పోస్టుల కోసం ఎదురుచూస్తున్నారు. ఎస్బీఐ అధికారిక వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. త్వరలో దీనికి సంబంధించిన నోటిఫికేషన్ వెలువరించింది. వాస్తవానికి ప్రతియేటా ఎస్బీఐ జనవరి, ఏప్రిల్ నెలల్లో రిక్రూట్‌మెంట్ నోటిపికేషన్ జారీ చేస్తుంటుంది. ఈసారి ఏప్రిల్ నెలలో నోటిఫికేషన్ జారీ చేయవచ్చు. దీనికి సంబంధించి ఎస్బీఐ క్లర్క్ ప్రిలిమినరీ పరీక్ష జూన్-జూలై నెలలో జరగవచ్చు. 


క్లర్క్ పోస్టులకు నిర్వహించే పరీక్ష కంప్యూటర్ ఆధారితంగా ఉంటుంది. ప్రిలిమినరీ పాస్ అయిన అభ్యర్ధులకు మెయిన్స్ పరీక్ష ఉంటుంది. ఆ తరువాత లాంగ్వేజ్ టెస్ట్ ఉంటుంది. ఏదైనా గుర్తింపు పొందిన కళాశాల నుంచి ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత పొందినవారు ఈ పోస్టులకు అర్హులు. పైనల్ సెమిస్టర్ రాసే విద్యార్ధులు కూడా పరీక్షకు హాజరు కావచ్చు. ఎస్బీఐ అప్లికేషన్ నింపేందుకు దిగువన ఇచ్చిన స్టెప్స్ ఫాలో కావల్సి ఉంటుంది.


ఎస్బీఐ అధికారిక వెబ్ సైట్  sbi.co.inలో ఎస్బీఐ క్లర్క్ దరఖాస్తు 2022 అందుబాటులో ఉంటుంది. వెబ్‌సైట్‌లో వెళ్లిన తరువాత కెరీర్‌పై క్లిక్ చేస్తే మరో విండో ఓపెన్ అవుతుంది. ఇప్పుడు ఆర్బీఐ క్లర్క్ 2022పై క్లిక్ చేయాలి. ఆ తరువాత మీ వివరాలు, డాక్యుమెంట్లు అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ ద్వారా ఫీజు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్ధులకు ఏ విధమైన ఫీజు లేదు. ఓబీసీ, జనరల్, ఈడబ్ల్యూఎస్ అభ్యర్ధులు మాత్రం 750 రూపాయలు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. 


Also read: IMD Twitter Hack: షాకింగ్... భారత వాతావరణ శాఖ ట్విట్టర్ ఖాతా హ్యాక్..


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook