Customer denied entry into SBI for wearing shorts: షార్ట్స్ ధరించి బ్యాంకుకు వెళ్లిన ఓ కోల్‌కతా యువకుడికి చేదు అనుభవం ఎదురైంది. ఆ దుస్తుల్లో అతన్ని బ్యాంకు లోపలికి అనుమతించేందుకు సిబ్బంది నిరాకరించారు. సదరు యువకుడు ఈ విషయాన్ని ట్విట్టర్‌లో నెటిజన్లతో షేర్ చేసుకున్నాడు. కస్టమర్ ఎలాంటి దుస్తులు (Dress code) ధరించాలి... ఎటువంటివి ధరించకూడదనే విషయంలో అధికారిక పాలసీ ఏమైనా ఉందా అని సదరు బ్యాంకు యాజమాన్యాన్ని ప్రశ్నించాడు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

'ఇవాళ నేను షార్ట్స్ ధరించి ఓ ఎస్‌బీఐ (State Bank of India) బ్రాంచ్‌కు వెళ్లాను. అక్కడి సిబ్బంది నన్ను లోపలికి వెళ్లేందుకు అనుమతించలేదు. వెళ్లి ఫుల్ ప్యాంట్స్ వేసుకుని రమ్మని చెప్పారు. కస్టమర్స్ నుంచి తాము డీసెన్సీ కోరుకుంటున్నామని చెప్పి నన్ను వెనక్కి పంపించారు. దుస్తుల విషయంలో ఎస్‌బీఐకి అధికారిక పాలసీ ఏమైనా ఉందా...?' అని ఎస్‌బీఐ ట్విట్టర్ ఖాతాను ట్యాగ్ చేసి అతను ప్రశ్నించాడు.


ఆ యువకుడి ట్వీట్‌పై ఎస్‌బీఐ (SBI) యాజమాన్యం స్పందించింది. 'మా కస్టమర్లకు ఎటువంటి డ్రెస్ కోడ్ నిర్దేశించబడలేదు. దీనికి సంబంధించి ఎటువంటి పాలసీ కూడా లేదు. కస్టమర్లు తమకు నచ్చిన దుస్తుల్లో బ్యాంకుకు రావొచ్చు. మీకు ఏ బ్రాంచ్‌లో ఈ అసౌకర్యం కలిగిందో వివరాలు వెల్లడిస్తే.. దాన్ని మేము పరిష్కరిస్తాం.' అని ఎస్‌బీఐ స్పష్టం చేసింది. ఇంతలోనే సదరు యువకుడు తన సమస్య పరిష్కారమైందని... బ్రాంచ్ సిబ్బందిపై ఎటువంటి చర్యలు కోరుకోవట్లేదని రిప్లై ఇచ్చాడు. బ్యాంకు సిబ్బంది తన ఇంటికి వచ్చి కలిసి జరిగిన దానిపై చర్చించారని చెప్పాడు.



Also Read: చంద్రబాబుకు రజనీకాంత్ ఫోన్ కాల్... అసెంబ్లీ ఘటనపై విచారం వ్యక్తం చేసిన సూపర్ స్టార్...


మరోవైపు, ఈ వ్యవహారంపై నెటిజన్ల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కొంతమంది ఆ యువకుడికి మద్దతుగా ట్వీట్స్ చేయగా... మరికొందరు అతనితో విబేధించారు. 'ఆ బ్యాంకులో నీ ఖాతా క్లోజ్ చేసి మరో బ్యాంకుకు మారిపో...' అని ఓ నెటిజన్ సలహా ఇచ్చాడు. మరో నెటిజన్... 'మీరు నగ్నంగా తిరిగినా ఎస్‌బీఐకి (SBI) అభ్యంతరమేమీ లేదు. కానీ వాళ్లు తమ కస్టమర్ల గురించి ఆందోళన చెందుతారు. ఆఫీస్‌కు లేదా పెళ్లికి నువ్వు ఇలాగే షార్ట్స్‌లో వెళ్తావని నేననుకోవట్లేదు. కాబట్టి ఎందుకని కాస్త డీసెంట్ దుస్తులు ధరించకూడదు.' అని పేర్కొన్నాడు.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook