Banks Strike: దేశవ్యాప్త బ్యాంకు ఉద్యోగుల సమ్మెకు ఎస్బీఐ దూరమా
Banks Strike: దేశవ్యాప్తంగా రెండ్రోజులపాటు బ్యాంకు సేవలు నిలిచిపోనున్నాయి. బ్యాంక్ యూనియన్స్ ఇచ్చిన సమ్మె పిలుపు మేరకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అప్రమత్తమైంది. అటు కస్టమర్లకు ఇటు యూనియన్‌కు విజ్ఞప్తి చేసింది.
Banks Strike: దేశవ్యాప్తంగా రెండ్రోజులపాటు బ్యాంకు సేవలు నిలిచిపోనున్నాయి. బ్యాంక్ యూనియన్స్ ఇచ్చిన సమ్మె పిలుపు మేరకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అప్రమత్తమైంది. అటు కస్టమర్లకు ఇటు యూనియన్‌కు విజ్ఞప్తి చేసింది.
భారత ప్రభుత్వ రంగంలోని రెండు బ్యాంకుల్ని ప్రైవేటీకరణ చేయాలనే కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా రెండ్రోజులపాటు సమ్మె జరగనుంది. డిసెంబర్ 16, 17 తేదీల్లో రెండ్రోజుల సమ్మెకు యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ పిలుపునిచ్చాయి. ఫలితంగా దేశవ్యాప్తంగా బ్యాంకు సేవలన్నీ నిలిచిపోనున్నాయి. రెండ్రోజులపాటు బ్యాంకు సేవలు నిలిచిపోనుండటంతో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అప్రమత్తమైంది. కస్టమర్లకు అలర్ట్ జారీ చేసిన ఎస్బీఐ..బ్యాంకు ఉద్యోగులకు విజ్ఞప్తి చేసింది.
సమ్మెలో పాల్గొనడంపై ఎస్బీఐ(SBI)ఉద్యోగులు మరోసారి ఆలోచించుకోవాలని ఎస్బీఐ విజ్ఞప్తి చేసింది. లావాదేవీలకు , ఇతర సేవలకు ఆటంకం లేకుండా చూడాలని కోరింది. కరోనా మహమ్మారి సమయంలో సమ్మెలు చేపడితే సేవలకు విఘాతం కలుగుతుందని ఎస్బీఐ తెలిపింది. డిసెంబర్ 17, 18 తేదీల్లో బ్యాంకులు సాధారణంగానే పనిచేస్తాయని..కానీ ఖాతాదారులకు అందించే సేవలపై ప్రభావం పడుతుందని ఎస్బీఐ పేర్కొంది. ఈ సమ్మె వల్ల బ్యాంక్, ఇన్వెస్టర్లు, కస్టమర్లకు ఏ విధమైన ఆసక్తి ఉండదన్నారు.
ఈ క్రమంలో డిజిటల్ లావాదేవీలు జరుపుకోవాలని కస్టమర్లకు కోరింది ఎస్బీఐ. అత్యవసరమైతే తప్ప బ్యాంకుకు రావద్దని కూడా ఎస్బీఐ కస్టమర్లకు అలర్ట్ జారీ చేసింది. అయితే ఏటీఎంలో క్యాష్ డిపాజిట్ విషయంపై ఏ విధమైన ప్రకటన జారీ కాలేదు. బ్యాంకుల సమ్మె ప్రకటన ఇలా ఉంటే..ప్రైవేటీకరణ వ్యవహారంపై కేబినెట్ కమిటీ ఇంకా ఏ విధమైన నిర్ణయం తీసుకోలేదని ఆర్ధికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్(Nirmala Sitaraman)తెలిపారు.
Also read: BiggBoss 5 Title Winner: బిగ్‌బాస్ తెలుగు సీజన్ 5లో సన్నీనే టాప్, అతనికి ఇతరులకు తేడా ఇదే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి