న్యూఢిల్లీ: ఇప్పటివరకు తమ మొబైల్ నంబరును తమ బ్యాంకు ఖాతాలతో అనుసంధానం చేసుకోని ఖాతాదారులకు భారతీయ స్టేట్ బ్యాంకు (ఎస్‌బీఐ) తాజాగా నవంబర్ 30వ తేదీని డెడ్‌లైన్‌గా విధించింది. ఆలోగా మొబైల్ నంబరును బ్యాంక్ ఖాతాతో అనుసంధానం చేసుకోని వారికి డిసెంబర్ 1 నుంచి ఆన్‌లైన్ సేవలు నిలిచిపోతాయని ఎస్బీఐ తేల్చిచెప్పింది. ఆ మరుసటి రోజైన డిసెంబరు 1వ తేదీ నుంచే ఈ కొత్త నిబంధన అమల్లోకి రానుందని ఎస్బీఐ తాజా ప్రకటనలో స్పష్టంచేసింది. 


మొబైల్ నెంబర్‌ను బ్యాంక్ ఖాతాతో అనుసంధానం చేసుకోవాలనుకునే ఖాతాదారులు బ్యాంకు కౌంటర్‌లో సంప్రదించవచ్చని, లేని పక్షంలో ఏటీఎం ద్వారా కానీ మొబైల్ నెంబర్‌ను అనుసంధానం చేసుకునే వీలు ఉందని ఎస్బీఐ తెలిపింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) సూచనల మేరకే బ్యాంకు ఈ ప్రకటన విడుదల చేసినట్టు ఎస్బీఐ వివరించింది.