డిగ్రీ చేసిన వారికి ఎస్‌బీఐలో 2000 పీవో ఉద్యోగాలు
దేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ).
దేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ). తాజాగా ఎస్‌బీఐలో ప్రొబేషనరీ ఆఫీసర్స్(పీవో) పోస్టుల భర్తీకి ముంబై సెంట్రల్ రిక్రూట్‌మెంట్ అండ్ ప్రొమోషన్ డిపార్ట్‌మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తిగల అభ్యర్థులు ఖాళీలు, అర్హత వివరాల కోసం నోటిఫికేషన్‌ను చదివి దరఖాస్తు చేసుకోండి.
పోస్టు: ప్రొబేషనరీ ఆఫీసర్
* మొత్తం ఖాళీల సంఖ్య - 2000.
* పేస్కేల్: ప్రారంభ వేతనం రూ. 27,620/- (నాలుగు అడ్వాన్స్ ఇంక్రిమెంట్స్‌తో) డీఏ, హెచ్‌ఆర్‌ఏ తదితర అలవెన్సులు ఇస్తారు. సీటీసీ రూ.8.20- 13.08 లక్షల వరకు ఉంటుంది.
* కేటగిరీల వారీగా: ఎస్సీ-300, ఎస్టీ -150, ఓబీసీ -540, జనరల్-1040 ఖాళీలు ఉన్నాయి. వీటిలో పీహెచ్‌సీ కోటాలో ఎల్‌డీ-27, వీఐ- 26, హెచ్‌ఐ -65 ఖాళీలను కేటాయించారు.
* అర్హతలు: 2018, ఆగస్టు 31 నాటికి గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత. సీఏ అర్హత ఉన్నవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
* వయస్సు: 2018, ఏప్రిల్ 1 నాటికి 21 - 30 ఏండ్ల మధ్య ఉండాలి. ఎస్సీ/ఎస్టీలకు ఐదేండ్లు, ఓబీసీలకు మూడేండ్లు, పీహెచ్‌సీలకు పదేండ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
మూడంచెల ఎంపిక విధానం ఉంటుంది. మొదట ప్రిలిమినరీ ఎగ్జామినేషన్, తరువాత మెయిన్ ఎగ్జామినేషన్, అటుపిమ్మట గ్రూప్ ఎక్సర్‌సైజ్, ఇంటర్వ్యూ ఉంటుంది. గమనిక: ప్రిలిమినరీ, మెయిన్‌లో నెగెటివ్ మార్కింగ్ విధానం ఉంది. ప్రతి తప్పు జవాబుకు ఆ ప్రశ్నకు కేటాయించిన మార్కులో 1/4వ వంతు కోతవిధిస్తారు.
* మెయిన్ ఎగ్జామ్ (ఆబ్జెక్టివ్, డిస్క్రిప్టివ్), గ్రూప్ ఎక్సర్‌సైజ్, ఇంటర్వ్యూలో వచ్చిన మార్కుల ఆధారంగా తుది ఎంపిక చేస్తారు.
* శిక్షణకు ఎంపికైన అభ్యర్థులకు రెండేండ్లపాటు ప్రొబేషనరీ పీరియడ్‌గా గుర్తిస్తారు.
ఆన్‌లైన్‌లో దరఖాస్తు:
* దరఖాస్తుకు చివరితేదీ: మే 13
* ప్రిలిమినరీ ఎగ్జామ్ పరీక్ష కేంద్రాలు: తెలంగాణ-హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్; ఆంధ్రప్రదేశ్- అనంతపురం, చీరాల, చిత్తూరు, తిరుపతి, కర్నూలు, గుంటూరు, కడప, కాకినాడ, నెల్లూరు, ఒంగోలు, పుత్తూరు, రాజమండ్రి, శ్రీకాకుళం, విజయవాడ, వైజాగ్, విజయనగరం
* ప్రిలిమినరీ ఎగ్జామ్ తేదీలు : 2018 జూలై 1, 7, 8 తేదీల్లో నిర్వహిస్తారు.
* ప్రిలిమినరీ ఎగ్జామ్ ఫలితాల వెల్లడి: జూలై 15, 2018
* మెయిన్ ఎగ్జామ్: తెలంగాణ- హైదరాబాద్; ఆంధ్రప్రదేశ్- గుంటూరు, విజయవాడ, వైజాగ్, కర్నూలు
* మెయిన్ ఎగ్జామ్ తేదీ: ఆగస్టు 4, 2018
* ఫలితాల వెల్లడి: ఆగస్టు 20, 2018
* గ్రూప్ ఎక్సర్‌సైజ్, ఇంటర్వ్యూ: 24.09.2018 నుండి 12.10.2018
* తుది ఫలితాలు వెల్లడి: 01.11.2018
* అప్లికేషన్ ఫీజు: జనరల్, ఓబీసీలకు రూ. 600/-, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీలకు రూ. 100/-
*వెబ్‌సైట్: https://bank.sbi/careers, https://www.sbi.co.in/careers